Naga Chaitanya – Samantha : చైసామ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. టాలీవుడ్ ఇండస్త్రీలో ఏమాయె చేశావే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం ప్రేమ, పెళ్లి, విడాకులుగా మారింది. ఒకప్పుడు వీరిద్దరూ టాలీవుడ్ మోస్ట్ లవ్ కపుల్స్. కానీ వీరు విడిపోవడం అనేది టాలీవుడ్ ప్రేక్షకులు అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ వీరు విడిపోయి సంవత్సరం గడిచినప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ల గురించే చర్చ నడుస్తుంది. నిత్యం ఏదో విధంగా నాగచైతన్య సమంత వార్తల్లో నిలుస్తున్నారు. గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించిన జంట ఎందుకు విడిపోతున్నారనేది మాత్రం స్పష్టతనివ్వలేదు.
Read Also: Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ ఇంటి ముందు ఫ్యాన్స్ హంగామా
వీరు కలుసుకోవాలని ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వీరు మాత్రం కలవలేదు. అంతలోనే సమంత ఒక పెద్ద షాక్ ఇచ్చింది. ఇటీవల తనకు మయో సిటీస్ అనే అరుదైన వ్యాధి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సామ్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ పోస్ట్ లు పెట్టారు. ఈ తరుణంలోనే సామ్ మాజీ భర్త నాగ చైతన్య స్పందించకపోవడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒక ట్వీట్ వేస్తే బాగుండేదని చర్చించుకుంటున్నారు.
Read Also: Punyavanthi: మేటి నటీనటుల కలయికలో ‘పుణ్యవతి’!
సమంత ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే నాగచైతన్య స్పందించారట. అప్పుడే ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారట. అంతే కాకుండా ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని సూచించినట్లు వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే నాగచైతన్యను మరో పెళ్లి చేసుకోమని సామ్ సలహా ఇచ్చిందన్న వార్తలు కూడా పుకార్లు చేస్తున్నాయి. ఆమె ఆరోగ్యం ఇలా ఉందనే చైతుకు అలాంటి సలహా ఇచ్చిందని కూడా అనుకుంటున్నారు.