Telangana Assembly Elections 2023: ఉత్కంఠరేపుతోన్న ఎగ్జిట్ పోల్స్.. ఓట్లపై ఆరా తీస్తున్న అభ్యర్థులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్ని్కల్లో పోలింగ్ ముగిసింది.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియగా.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలిపిస్తున్నారు అధికారులు.. అయితే, ఎగ్జిట్ పోల్స్ కొందరు అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే.. మరికొందరని టెన్షన్ పెంచుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ చూస్తే.. కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్నారు ఓటర్లు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 62-72, బీఆర్ఎస్ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీ 42.7, బీఆర్ఎస్ 37.8, బీజేపీ 13.2, ఎంఐఎం 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్ – సౌత్‌ఫస్ట్ సర్వే పేర్కొంది.. కాంగ్రెస్ 4.9 శాతం ఓట్లు అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది.. దీంతో.. లెక్కలు తేల్చుకునే పనిలో పడిపోయారు ఆయా పార్టీల అభ్యర్థులు..
Read Also: Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ధర ఎంతో తెలుసా?
Also Read
తన నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్‌ల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఏ పోలింగ్ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి..? అందులో మనకు అనుకూలంగా ఎన్ని పడ్డాయి? లాంటి విషయాలపై ఆరా తీస్తున్నారు.. గ్రామస్థాయి లీడర్లు, బూత్‌స్థాయి లీడర్లకు ఫోన్లు చేసి.. ఆ వివరాలను తెప్పించుకుంటున్నారట.. ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ రేపుతుండగా..? డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వచ్చే వరకు వేచిచూసే పరిస్థితి లేకుండా చేస్తుందట.. దీంతో.. బూత్‌స్థాయి నుంచి వివరాలు తెప్పించుకుని.. తమకు వచ్చే ఓట్లు..! గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుంది..? ఓడితే ఎన్ని ఓట్లతో పరాజయం పాలయ్యే అవకాశం ఉంది? లాంటి లెక్కలు కట్టడంలో అభ్యర్థులు, వారి అనుచరులు తలమునకలు అవుతున్నారట.. 28వ తేదీ వరకు ప్రచారం.. ఆ తర్వాత ప్రలోభాల పర్వంలో మునిగిపోయిన నేతలు.. ఇప్పుడు గణాంకాలు తీసేపనిలో బిజీ అయిపోయారట.. డిసెంబర్ 3వ తేదీన ఎలాంటి ఫలితం రాబోతోంది? అనే విషయాన్ని ముందే తేల్చే విధంగా అంచనాల్లో మునిగిపోయారట.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!