India-Canada Row: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు.. కెనడా తీవ్ర ఆరోపణలు
- మరోసారి భారత్ పై తీవ్ర ఆరోపణలు చేసిన కెనడా..
- లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో భారత ఏజెంట్లకు సంబంధాలు..
- ఆ గ్యాంగ్‌తో కలిసి ప్రో ఖలీస్థానీలను భారత ఏజెంట్లు టార్గెట్ చేస్తున్నారు: కెనడా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Canada Row: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు అనుమానితుల లిస్టులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చి భారత్ తో కెనడా కయ్యానికి కాలుదువ్వింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరును తెర పైకి తెచ్చి భారత్‌పై బురద జల్లే ప్రయత్నం చేసిందన్నారు. ఆ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు.. ప్రో ఖలీస్థానీలను టార్గెట్ గా చేసుకొని కెనడా భూభాగంపై పని చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
Read Also: Gold Rate Today: తగ్గిన బంగారం ధర.. నేడు తులం ఎంతంటే?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఇక, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో విచారణ పురోగతి వివరాలను రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు సోమవారం రాత్రి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్సీఎంపీ అసిస్టెంట్ కమిషనర్ బ్రిగిట్టె గౌవిన్ మాట్లాడుతూ.. కెనడాలోని ప్రో- ఖలిస్థానీలను భారత ఏజెంట్లు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. వీరు కొన్ని గ్రూప్‌ల సహాయంతో మా భూభాగంపై నేరాలకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. లారెన్స్ బిష్ణోయ్ గ్రూప్ ఇందులో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో రహస్య సంబంధాలు ఉన్నాయని మేం నమ్ముతున్నాం అని గౌవిన్ వెల్లడించారు. ఈ ఆరోపణలకు కూడా ఒట్టావా ఎలాంటి ఆధారాలను చూపించలేదు.
Read Also: Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు.. ఫ్లైఓవర్ పై వాహనాల పార్కింగ్
అయితే, మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యతో ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ వార్తల్లో నిలిచింది. ఈ సందర్భంగా బిష్ణోయ్ గ్యాంగ్ పేరును కెనడా అధికారులు ప్రస్తావించడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం ఈ పంజాబీ గ్యాంగ్‌స్టర్ జైలులో ఉన్నారు. అతడి సోదరుడు, ఇతర అనుచరులు కెనడా కేంద్రంగా నేరాలకు పాల్పడుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి.
#WATCH | Ottawa, Ontario (Canada): "It (India) is targeting South Asian community but they are specifically targeting pro-Khalistani elements in Canada…What we have seen is, from an RCMP perspective, they use organised crime elements. It has been publically attributed and… pic.twitter.com/KYKQVSx7Ju
— ANI (@ANI) October 14, 2024
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!