Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Canada Qualifies For Icc Mens T20 World Cup 2026 After Dominant Win Over Bahamas

T20 World Cup 2026 Canada: T20 ప్రపంచకప్‌ 2026కు అర్హత పొందిన కెనడా..!

Published Date :June 22, 2025 , 9:56 pm
By Kothuru Ram Kumar
T20 World Cup 2026 Canada: T20 ప్రపంచకప్‌ 2026కు అర్హత పొందిన కెనడా..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

T20 World Cup 2026 Canada: భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026కు కెనడా జట్టు అర్హత సాధించింది. ఒంటారియోలో జరిగిన అమెరికాస్ రీజినల్ క్వాలిఫయింగ్ ఫైనల్స్‌ లో బహామాస్‌ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి కెనడా ఈ ఘనత సాధించింది. కెనడా, బర్ముడా, కేమన్ ఐలాండ్స్, బహామాస్ నాలుగు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో కెనడా తమ ఐదో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడకుండా.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

Read Also:Operation Midnight Hammer: ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా విధ్వంసం.. శాటిలైట్‌ చిత్రాలు వెలుగులోకి

కెనడా 2024 టీ20 ప్రపంచకప్‌కు కూడా అర్హత పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2026 టోర్నమెంట్‌లో కూడా హాజరు కానుంది. ఇప్పటికే ఈ మెగా టోర్నీకి ఆతిథ్య జట్లు భారత్, శ్రీలంకలతో పాటు అఫ్ఘానిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, అమెరికా (USA), వెస్టిండీస్ జట్లు అర్హత పొందాయి.ఇక ఈ టోర్నీకి మిగిలిన ఏడు జట్లు యూరోప్ నుండి రెండు, ఆఫ్రికా నుండి రెండు, ఆసియా-ఈఏపీ నుండి మూడు జట్లు క్వాలిఫయింగ్ ద్వారా ఎంపిక కానున్నాయి.

Read Also:Brahmaji: అరె భాయ్ అదంతా జోక్.. మంచు విష్ణు 7000 ఎకరాలపై బ్రహ్మాజీ సంచలన పోస్ట్..!

కెనడాకు బహామాస్‌పై జరిగిన చివరి గేమ్‌లో, కెనడా బౌలర్లు ప్రత్యర్థిని 19.5 ఓవర్లలో కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇందులో కలీమ్ సనా 4 ఓవర్లలో 6 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయగా, అంష్ పటేల్ 4 ఓవర్లలో 7 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, శివం శర్మ 2.5 ఓవర్లలో 16 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసి మెరిశారు. ఆ తర్వాత టార్గెట్ ను చేధించడానికి వచ్చిన కెనడా బ్యాట్స్‌మెన్ ఆ టార్గెట్‌ను కేవలం 5.3 ఓవర్లలో ఛేదించారు. దిల్ప్రీత్ బజ్వా 14 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచారు. కెనడా చివరి మ్యాచ్ ఆదివారం బర్ముడాతో జరగనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Americas Regional Final
  • Canada Cricket Team
  • Cricket Canada
  • ICC T20 World Cup Qualifiers
  • T20 World Cup 2026

తాజావార్తలు

  • Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు అదృష్టం తలుపు తట్టబోయే రాశులు ఇవే! కుబేరుడి అనుగ్రహంతో డబ్బే డబ్బు..

  • PBKS vs SRH: ఆరెంజ్ ఆర్మీకి షాక్.. 220 పరుగుల టార్గెట్‌ను అలవోకగా ఛేదించిన పంజాబ్ కింగ్స్.!

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • సింగల్ హ్యాండ్ తో Marco Jansen అద్భుత క్యాచ్‌.. అబ్బురపోయిన SRH కెప్టెన్ ఇషాన్ కిషన్..!

  • Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions