T20 World Cup 2026 Canada: భారతదేశం, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026కు కెనడా జట్టు అర్హత సాధించింది. ఒంటారియోలో జరిగిన అమెరికాస్ రీజినల్ క్వాలిఫయింగ్ ఫైనల్స్ లో బహామాస్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి కెనడా ఈ ఘనత సాధించింది. కెనడా, బర్ముడా, కేమన్ ఐలాండ్స్, బహామాస్ నాలుగు జట్ల మధ్య జరిగిన ఈ టోర్నమెంట్‌లో కెనడా తమ ఐదో వరుస విజయాన్ని నమోదు చేసుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల…