Canada: భారత్‌తో సంబంధాలపై కెనడా రక్షణ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం కెనడా- భారత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఖలిస్తాన్ వివాదం రెండు దేశాల మధ్య రగులుతూనే ఉంది. సిక్కు వేర్పాటువాది నిజ్జర్ హత్య విషయంలో భారత్ హస్తముందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపణలు చేయడంతో ఈ వివాదం మొదలైన విషయం తెలిసిందే. దీంతో భారత్ కెనడా సంబంధాలు దెబ్బతిన్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Delhi: పదో తరగతి బాలుడిపై నలుగురు టీచర్లు దాడి.. తీవ్ర గాయాలు
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
ఈ నేపథ్యంలో కెనడా కెనడా రక్షణ శాఖ మంత్రి బిల్ బ్లెయిర్ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. భారత్‌తో రక్షణ సంబంధాలు తమకెంతో ముఖ్యమని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘ది వెస్ట్ బ్లాక్’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్యపై జరుగుతుందని తెలిపిన ఆయన ఇతర అంశాల్లో రెండు దేశాల భాగస్వామ్యం కొనసాగడం అవసరమని పేర్కొన్నారు. తమ దేశ భూభాగాన్ని, చట్టాలను, పౌరులను రక్షించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్న మంత్రి బిల్ బ్లెయిర్ నిజ్జర్ హత్య తమకు సమస్యాత్మకంగా మారిందన్నారు. ఇక ఈ కేసులో ఉన్న ఆరోపణలు నిజమని తేలితే ఇది ఒక ఆందోళనకరమైన అంశంగా మారుతుందన్న ఆయన ఇండో పసిఫిక్ వ్యూహానికి కెనడా ఇప్పటికీ ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని చెప్పుకోచ్చారు. అయితే ఈ విషయంలో అమెరికా కూడా కొంత సమాచారాన్ని కెనడాకు అందించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ ఆరోపణలను ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి దేశాలు ఖండించాయి. రెండు దేశాలు సమస్యను పరిష్కరించుకోవాలని ఇతర దేశాలు కోరుతున్నాయి. ఇక ఈ వివాదం నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత రాయబారిని దేశం నుంచి బహిష్కరించడం, భారత్ కూడా కెనడా దౌత్య అధికారిని దేశం నుంచి బహిష్కరించడం లాంటివి చేశాయి. ఈ నేపథ్యంలోనే ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా కెనడాలో ఉన్న భారతీయులను భయభ్రాంతులకు గురిచేశారు. అంతేకాకుండా భారత్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించిన విషయం కూడా తెలిసిందే.
- Tags
- Bill Blair
- Canada
- india
- Khalisthan
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!