సాధారణంగా ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే వర్షాకాలంలో వీటిని తినకూడదని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఆకు కూర మొక్కలు భూమి నుంచి తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వాటి ఆకులు నేలకు తాకుతూ ఉంటాయి. అయితే వర్షాలు పడేటప్పుడు నీరు ఎక్కడెక్కడి నుంచో కొట్టుకువస్తూ ఉంటుంది.
అలా వచ్చిన నీరు మొక్కల ఆకులను తాకడం వాటికి దగ్గరగా రావడం కారణంగా అవి కలుషితం అవుతూ ఉంటాయి. దీని కారణంగా సూక్ష్మజీవులు, హాని కలిగించే క్రిములు వాటి మీద చేరే అవకాశం ఉంటుంది. అసలే వర్షాకాలంలో ఆకుల మీద పురుగులు ఎక్కువగా చేరుతూ ఉంటాయి. దీని కారణంగా వీటిని తీసుకోకుండా ఉండటమే మంచిది.ఆకు కూరలు ఎక్కువగా తినే అలవాటు ఉన్న వారు వారంలో మూడు, నాలుగు సార్లు కాకుండా ఒక్కసారి మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది.
Also Read: Health News: జర్వం వచ్చినప్పుడు బాలింతలు పిల్లలకు పాలు ఇవ్వొచ్చా?
అసలే వానాకాలంలో డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆకు కూరలను తీసుకుంటే త్వరగా జీర్ణం కాకపోవచ్చు. అందుకే వర్షాకాలంలో ఆకుకూరలు కాకుండా వంకాయ, బెండకాయ లాంటి ముదురు రంగులు ఉండే కూరగాయలు తినాలి. భూమికి ఎత్తులో పెరిగే కూరగాయలు తినడానికి ప్రయత్నించాలి. వంటచేసేటప్పుడు కూరగాయలను ఉప్పు నీటిలో కొద్దిసేపు ఉంచి శుభ్రం చేసి కట్ చేసిన వెంటనే వండేస్తే మంచిది.