Broccoli Superfood: బ్రోకలీ.. ఇది కాలీఫ్లవర్ రకానికి చెందిన ఒక కూరగాయ. ఇది చూడడానికి ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి, చూడడానికి కాలీఫ్లవర్ మాదిరిగానే ఉంటాయి. ఇక ఈ బ్రోకలీలో అనేక పోషక విలువలు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక కొన్ని అధ్యయనాలు ఇందులో అనేక క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక 100 గ్రాముల బ్రోకలీలో సుమారుగా 35 కాలోరీలు మాత్రమే ఉంటాయి. కానీ, ఇది కడుపుని నింపే లక్షణం కలిగి ఉంటుంది. ఇందులో ఉండే అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో ఎక్కువగా ఆహరం తీసుకోవాల్సిన కోరిక తగ్గుతుంది.
Read Also: Kuldeep Yadav Engagement: చిన్ననాటి స్నేహితురాలితో ఘనంగా కుల్దీప్ యాదవ్ నిశ్చితార్థం..!
అంతేకాకుండా బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ C, విటమిన్ K, ఫోలేట్, పొటాషియం వంటి అనేక కీలక పోషకాలు ఉన్నాయి. ఇది మెటబాలిజాన్ని వేగంగా పనిచేయేలా చేయడంలో కూడా సహాయపడుతుంది. బ్రోకలీలో ఉండే సల్ఫోరఫేన్ అనే యాంతీజనిక్ పదార్థం శరీరంలో ఫ్యాట్‌ని ప్రభావవంతంగా ఆక్సిడైజ్ చేయడంలో సహాయపడుతుంది. బ్రోకలీని సూప్, స్టిర్ ఫ్రై, సలాడ్స్, స్టీమ్ వంటకాల రూపంలో తినవచ్చు. ఇది న్యూట్రిషన్, బరువు తగ్గించడం కోసం ఓ సమతుల్యతను అందిస్తుంది. కాబట్టి, బ్రోకలీని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గడం సాధ్యమవుతుంది.
Read Also: Hyundai Verna SX+: 5 స్టార్ భద్రతా ప్రమాణాలు, టాప్ క్లాస్ సౌకర్యాలతో హ్యుందాయ్ వెర్నా SX+ లాంచ్..!