Railway Employees Bonus 2025: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం పలు కీలక ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఈ పండుగ సీజన్లో దాదాపు 11 లక్షల మంది రైల్వే ఉద్యోగులు బోనస్ ప్రకటించింది. రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైల్వే ఉద్యోగులకు రూ.1,865.68 కోట్ల బోనస్ చెల్లించడానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సర్కార్ ఒక ప్రకటనలో తెలిపింది.
READ ALSO: KTR: బీజేపీ మోసం రాముడికి కూడా అర్థమైంది.. కరీంనగర్ ప్రజలు మాత్రం..!
అర్హత కలిగిన ప్రతి రైల్వే ఉద్యోగికి 78 రోజుల వేతనానికి సమానమైన PLB గరిష్టంగా చెల్లించవలసిన మొత్తం ఒక్కొక్కరికి రూ. 17,951గా అంచానా. ఈ మొత్తాన్ని రైల్వే సిబ్బందిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు (గార్డ్), స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, టెక్నీషియన్ హెల్పర్లు, పాయింట్స్మన్, మినిస్టీరియల్ సిబ్బంది, ఇతర గ్రూప్ సి సిబ్బంది వంటి వివిధ వర్గాలకు చెల్లించనున్నారు. అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు PLB చెల్లింపు ప్రతి ఏడాది దసరా సెలవులకు ముందు అందజేస్తున్నారు.
అలాగే కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్ ప్రకటనతో పాటు, సాహెబ్ గంజ్ – బెట్టయ్య NH 139 నాలుగు లైన్ల రహదారి 79 కిమీ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3822 కోట్లతో నిర్మితం కానున్న NH 139, రెండేళ్లలో పూర్తి కానున్నట్లు సమాచారం. భక్తియార్పూర్ – రాజ్గిర్ -తలయ రైల్వే లైన్ డబ్లింగ్కి కూడా కేబినెట్ ఆమోదం లభించింది. రూ. 2192 కోట్లతో 104 కి.మీ మేర రైల్వే లైన్ డబ్లింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ పనులతో బిహార్- జార్ఖండ్ మధ్య రైల్వే కనెక్టివిటీ పెరగనుంది. షిప్పింగ్ మారిటైమ్ అభివృద్ధి సంస్కరణల కోసం రూ.69725 కోట్లు కేటాయించారు.
READ ALSO: China New Virus: ఉత్తర కొరియాను వణికిస్తున్న.. చైనా కొత్త వైరస్..!