Karnataka: కర్ణాటకలో ఖాళీగా ఉన్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో ఉప ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఉప ఎన్నికలు జూన్ 30న జరుగుతాయని తెలిపింది. గతంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన బాబూరావు చించన్‌సూర్, ఆర్.శంకర్, సవాడి లక్ష్మణ్ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచారు. దీంతో తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖాళీగా ఉన్న ఆ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ముగ్గురు సభ్యుల పదవీకాలం జూన్‌తో ముగియడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎమ్మెల్యేలు సవాడి లక్ష్మణ్, బాబూరావు చించన్‌సూర్ పదవీకాలం జూన్ 14న, జూన్ 17న ముగియగా, ఆర్ శంకర్ పదవీకాలం జూన్ 30తో ముగుస్తుంది.
Read Also: DGP Anjani Kumar:| మానవ అక్రమ రవాణా నిరోధంలో తెలంగాణ మొదటి స్థానం : డీజీపీ అంజనీ కుమార్
కర్ణాటక లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉపఎన్నికల షెడ్యూల్ ఇదే..
జూన్ 13: నోటిఫికేషన్ జారీ
జూన్ 20: నామినేషన్ వేసేందుకు చివరి తేదీ
జూన్ 21: నామినేషన్ల పరిశీలన
జూన్ 23: అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీ
జూన్ 30: పోలింగ్ తేదీ
జూన్ 30: ఓట్ల లెక్కింపు
జూన్ 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోలింగ్ జరగనుండగా, అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.