రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమేష్ నాయుడు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు వచ్చాయి.
READ MORE: CM Chandrababu: ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం.. పేదలకు ఇళ్ళ స్థలాలపై చర్చ!
ఈ నేపథ్యంలో వారం క్రితం తిరుపతి రూరల్‌లోని 27 మంది ఎంపీటీసీలను మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముంబై తరలించారు. శనివారం ఎంపీటీసీలకు రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రక్షణ కోసం ముగ్గురు ఎంపీటీసీల ఇళ్లు వద్ద ఒక్కో కానిస్టేబుల్‌ను అధికారులు నియమించారు. మరోవైపు.. రామిరెడ్డిపల్లి వైసీపీ మద్దతుదారులైన ముగ్గురు వార్డు మెంబర్లను టీడీపీ నేతలు శ్రీశైలం తరలించారు. పోటీ జరిగే ప్రాంతాల్లో డీఎస్పీ ప్రసాద్ పర్యటించి పరిస్థితులను సమీక్షించారు.
READ MORE: Shreyas Iyer: నాకు మంచి ఊపొచ్చింది.. ఈ జోరును కొనసాగిస్తాం!