రేపు చంద్రగిరిలో ఒక ఎంపీపీ , రెండు వైస్ సర్పంచ్ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తిరుపతి రూరల్ (మం) ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ ఎంపీపీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. చంద్రగిరి (మం) రామిరెడ్డిపల్లిలో ఉప సర్పంచ్ ఉమ, యర్రావారిపాళెం, చింతకుంట ఉప సర్పంచ్ రమ�
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి 41ఏ నోటీసులు ఇచ్చి పోలీసులు విడుదల చేశారు. విదేశాలకు వెళ్లకూడదని షరతులు విధించారు.
చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తినాని హత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి అరెస్టు అయ్యారు. ఎన్నికల అనంతరం మే 14వ తేదీన శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ల పరిశీలన నిమిత్తం వచ్చిన పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు.
చిన్న వయసులో తుడా ఛైర్మన్ పదవి ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తుడా ఛైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆయన వెల్లడించారు.