Bus Fire Accident: స్లీపర్ బస్సుకు మంటలు.. బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్న ప్రయాణికులు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Fire Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మైహర్ జిల్లాలో NH–30పై ప్రయాణిస్తున్న ఓ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ఆ మంటకు క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. అయితే మంటలు వ్యాపించగానే ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించి బస్సు నుంచి బయటకు దూకడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం.
Cinema : రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తీస్తే ఏకంగా రూ. 50 కోట్లు వసూలు చేసింది
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ఇక అందిన వివరాల ప్రకారం.. జై భవాని ట్రావెల్స్‌కు చెందిన స్లీపర్ బస్సు (MP 30 P 7070) మార్చి 9న రీవా నుంచి ఇండోర్ కు బయలుదేరింది. ప్రయాణం మధ్యలో కట్నీ సమీపంలో బస్సులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో డ్రైవర్ మెకానిక్ సహాయంతో మరమ్మతులు చేయించుకున్న తర్వాత ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును తిరిగి రీవాకు తీసుకెళ్తున్నారు. ఈ సమయంలో నదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భేడా గ్రామం దగ్గర బస్సు ముందుభాగం నుంచి అకస్మాత్తుగా పొగ వచ్చి ఆ తర్వాత మంట రావడం ప్రారంభమైంది.
Flight Ticket Price Hike: విమాన టికెట్ ధరలకు రెక్కలు.. ఇంధన సర్ఛార్జ్ వడ్డింపు..
ఘటనపై బస్సు కండక్టర్ రుద్ర సింగ్ బఘేల్ మాట్లాడుతూ.. బోనెట్ నుంచి పొగ, మంట కనిపించగానే డ్రైవర్ వెంటనే బస్సును ఆపి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ గాలి వేగం కారణంగా మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తాన్ని ఆవరించాయి. ఈ గందరగోళంలో బస్సులో ఉన్న ప్రయాణికులు వెంటనే బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారని అన్నారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే నదన్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ రేణు మిశ్రా పోలీస్ బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భద్రత దృష్ట్యా కొంతసేపు హైవే ట్రాఫిక్‌ను మళ్లించారు. ఆ తర్వాత ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని కొద్దీ సేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే మంటలు ఎందుకు చెలరేగాయన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?