Kurnool Bus Fire Incident: కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో కొన్ని కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. అయితే ఈ ప్రమాదంలో నిద్రలో ఉన్న వాళ్లు నిద్రలోనే సజీవదహనం అయ్యారు.. దీంతో, ఏది ఎవరి మృతదేహం అని గుర్తించడమే సవాల్ గా మారిపోయింది.. మాంసపు ముద్దలుగా మారిపోవడంతో.. మృతదేహాలను గుర్తించే పనిలో పడిపోయారు వైద్యులు.. కర్నూలు జీజీహెచ్ పోస్టుమార్టం రూమ్‌లోనే ఉన్నాయి 19 మృతదేహాలు.. డీఎన్‌ఏ పరీక్ష అనంతరం బంధువులకు మృతదేహాలు అప్పగించనున్నారు అధికారులు..…
Ponnam Prabhakar: కర్నూలు జిల్లాలో బస్సు ప్రమాదంపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే వేధింపులు అంటున్నారని చెప్పారు.. ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని.. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు.