Bulldozers Rolled: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుకు దగ్గరలో ఉన్న జిల్లాల్లో అక్రమ మతపరమైన నిర్మాణాలపై ప్రభుత్వం భారీగా చర్యలు చేపట్టింది. అధికారిక ప్రకటన ప్రకారం, బుల్డోజర్ల చర్య మహారాజ్‌గంజ్, సిద్ధార్థ్‌నగర్, బల్రాంపూర్, శ్రావస్తి, బహ్రైచ్, లఖింపూర్ ఖేరి, పిలిభిత్ జిల్లాల్లో కనిపించింది. ఈ చర్యలు రాష్ట్రంలోని అక్రమ మతస్థలాలపై జరుగుతున్న విస్తృత స్థాయి వ్యతిరేక ఆక్రమణ డ్రైవ్‌లో భాగంగా సాగాయి.
Read Also: Jammu and Kashmir: జమ్ము కాశ్మీర్లో మరో ఎన్‌కౌంటర్.. కొనసాగుతున్న ఉగ్ర వేట
ఇక తాజాగా ఒక్కరోజే మహారాజ్‌గంజ్ జిల్లాలో రెండు స్థలాల్లో.. అలాగే శ్రావస్తి, బహ్రైచ్ జిల్లాల్లో ఒక్కో స్థలంలో కూల్చివేతలు నిర్వహించబడ్డాయి. సమాచారం మేరకు, ఇప్పటివరకు ఇండో-నేపాల్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల్లో 225 అక్రమ మదర్సాలు, 30 మసీదులు, 25 మజార్లు, 6 ఈద్గాలను తొలగించారు. మహారాజ్‌గంజ్ జిల్లాలోని ఫరెందా తాలూకాలోని సేమ్రహాని గ్రామం, నౌతన్వా తాలూకాలోని జుగౌలి గ్రామాల్లో ఉన్న రెండు అక్రమ మదర్సాలను కూల్చేశారు.
Read Also: RCB-IPL 2025: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. హిట్టర్ వచ్చేశాడు!
అలాగే శ్రావస్తి జిల్లాలో భింగా తాలూకాలోని కలీంపుర్వా గ్రామంలో ప్రభుత్వ భూమిపై నిర్మించబడిన అక్రమ మదర్సా ను కూల్చివేశారు. ఇక బహ్రైచ్ జిల్లాలో అటవీ భూమిపై ఆక్రమణ చేసిన మజార్‌ను తొలగించారు. ఈ చర్యలతో సరిహద్దు భద్రత, భూసంరక్షణ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. అక్రమ మతపరమైన నిర్మాణాలపై ఈ రకమైన చర్యలు ముందూ కూడా కొనసాగుతాయని సంకేతాలు కనిపిస్తున్నాయి.