Telangana Budget : ఉత్కంఠ రేకెత్తించిన తెలంగాణ బడ్జెట్ కు గవర్నర్ తమిళ్ సై ఆమోదం తెలిపారు. బడ్జెట్ సమర్పణ పత్రాలపై సంతకం చేశారు. దీంతో అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 3న బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం రెండు రోజలు తర్వాత ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఈ సారి బడ్జెట్ మూడు లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని సమాచారం. మండలి, అసెంబ్లీ సంయుక్త సమావేశానికి కూడా గవర్నర్ తమిళ్ సై అనుమతి ఇచ్చారు. రాష్ట్ర హైకోర్టు సూచనలతో రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్ న్యాయవాదుల మధ్య సోమవారం రాజీ కుదిరింది. హైకోర్టులో అత్యవసరంగా దాఖలు చేసిన పిటిషన్ విషయంలో ప్రభుత్వం, రాజ్‌భవన్ న్యాయవాదుల మధ్య అడ్వొకేట్ జనరల్ చాంబర్‌లో జరిగిన చర్చలు ఫలించాయి.
Read Also: Teachers Transfer : టీచర్ల బదిలీలకు దరఖాస్తు గడువు పొడగింపు
తమకు ఎలాంటి దురుద్దేశాలు లేవని రాజ్‌భవన్ న్యాయవాది పేర్కొనగా, సంయుక్త సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పారు. దీంతో ఇరుపక్షాల మధ్య అపోహలు తొలగిపోయాయి. బడ్జెట్ సమావేశాలపై స్పష్టత వచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్ తమిళిసైతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మనోగతాన్ని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనితో ఇటు ప్రభుత్వం, అటు రాజ్‌భవన్ మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్నట్టయ్యింది. మంత్రి, అధికారుల బృందం గవర్నర్‌తో భేటీ తరువాత బడ్జెట్ సమావేశాలకు మార్గం సుగమమైంది.
Read Also: Huge Fire : మధ్య ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం.. రూ.కోట్ల ఆస్తి నష్టం