హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు తన తల్లి జన్మదిన వేడుకలను జరుపుకునేందుకు వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మణికోండ ప్రాంతానికి చేందిన జయంత్ గౌడ్ (21) తన తల్లి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను స్నేహితులతో కలిసి జరుపుకోవాలని భావించాడు. ఫ్రెండ్స్ తో కలిసి మాదాపూర్ లోని యశోద హాస్పిటల్ వెనుక ఉన్న ప్రాంతంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. జయంత్ గౌడ్ స్నేహితులతో మద్యం సేవిస్తూ ఎంజాయ్ చేశారు.
ఈ సమయంలో ముగ్గురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. జయంత్ గౌడ్ తో ఆ మద్యం బాటిల్ తమకు ఇవ్వాలని గొడవకు దిగారు. అయితే అప్పటికే మద్యం సేవించి ఉన్న జయంత్ గౌడ్ అతని ఫ్రెండ్స్ దుండగులతో వాగ్వాదానికి దిగారు. జయంత్ తో పాటు 8 మంది స్నేహితులు కలిసి మద్యం సేవిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మాటా మాటా పెరిగి దుండగులు జయంత్ పై కత్తులతో దాడి చేశారు. దాడిలో జయంత్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు.
Also Read:Nigeria Floods: నైజీరియాను ముంచెత్తిన వరదలు.. 111 మంది మృతి
జయంత్ ను హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మాదాపూర్ పోలీసులు తెలిపారు. కాగా గతంలో ఓ మర్డర్ కేసులో ఉన్న జయంత్ గౌడ్ మూడు నెలలు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై వచ్చినట్లు సమాచారం.