NTV Telugu Site icon

MLC Kavitha: సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతాం..

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha: గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది. అనంతరం శాసన మండలి ఛైర్మన్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తర్వాత శాసనమండలి మీడియా పాయింట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మాట్లాడారు.

Read Also: Minister Seethakka: బీఆర్ఎస్ నేతల నిరసనపై మంత్రి సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

లగచర్ల రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు, వాళ్ళని వారి భూముల నుండి వెల్లగొట్టే కుట్రను ప్రభుత్వం చేస్తోందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి విమర్శించారు. నిన్న, ఈ రోజూ రైతుల పక్షాన మండలిలో నిరసన తెలిపామన్నారు. తమ భూములు లాక్కోవద్దు అని నినదించిన రైతులను రాష్ట్ర సర్కారు జైల్లో పెట్టిందన్నారు. గుండెపోటు వచ్చిన రైతుకు బేడీలు వేసి హాస్పిటల్‌కి తీసుకురావడం ఈ ప్రభుత్వం వైఖరికి నిదర్శనమన్నారు. చేయని తప్పుకి రైతులు జైల్లో ఉన్నారన్నారు. రైతుల సమస్యలపై చర్చించాలని అడిగితే సభను వాయిదా వేస్తున్నారన్నారు. కరోనా సమయంలో మా నాయకుడు కేసీఆర్ రైతులను ఎలా ఆదుకున్నారో ప్రజలు గమనించాలన్నారు. గిరిజన రైతుల పక్షాన నిలబడుతాం, వారి సమస్యలు పరిష్కరించేవరకు విడిచిపెట్టమన్నారు.

Read Also: Alla Nani: ఆళ్ల నాని చేరికకు లైన్‌ క్లియర్‌.. రేపే టీడీపీకి గూటికి మాజీ డిప్యూటీ సీఎం..

బీఆర్ఎస్ ఈరోజు సభలో మానవీయ ప్రశ్నను లేవనెత్తిందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ చెప్పారు. రైతును బేడీ వేసి హాస్పిటల్‌కి తెచ్చారని.. ఇది ప్రతి ఒక్కరు ఖండించాలన్నారు. ప్రజాస్వామ్యం మా ఏడో గ్యారెంటీ అన్న కాంగ్రెస్ ఇదేనా మీ ప్రజాస్వామ్యమంటూ ప్రశ్నించారు. రైతుల గురించి మాట్లాడాలి అంటే టూరిజం పాలసీ మీద చర్చ చేస్తారట అంటూ వ్యాఖ్యానించారు. ఇదేనా ప్రజా పాలన? ఇది ప్రజా పాలన కాదు ప్రజా పీడన అంటూ విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం కాదు ఇనుపకంచెల రాజ్యం అంటూ విమర్శలు గుప్పించారు. చెత్త పాలసీలు కాదు రైతుల గురించి చర్చిద్దాం అంటే సభను వాయిదా వేస్తున్నారన్నారు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్.

Show comments