గిరిజన రైతుల గురించి చర్చించాలని చర్చకు పట్టుబడితే సభను వాయిదా వేయడాన్ని తప్పుబడుతున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా వ్యాఖ్యానించారు. రైతులకు బేడీలు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. సభ జరిగినన్నీ రోజులు గిరిజన రైతుల పక్షాన పోరాడుతామన్నారు. శాసన మండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన నేపథ్యంలో శాసనమండలి బుధవారానికి వాయిదా పడింది.