MLC Kavitha: యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై, ఇళ్లపై దాడి చేసే వారిని కవిత హెచ్చరించారు. ‘మా పార్టీ కార్యాలయాలపైకి, ఇళ్లపైకి వస్తామంటే భయపడే ప్రసక్తే లేదు. 60 లక్షల మంది సైనికులు ఉన్న కుటుంబం బీఆర్ఎస్ పార్టీ అని ఆమె పేర్కొన్నారు. ‘60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు తిరిగే పరిస్థితి ఉండదని కాంగ్రెస్ నేతలకు హెచ్చరిక చేసారు. ‘‘ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులు… జాగ్రత్తగా ఉండండి’’ అంటూ కాంగ్రెస్ నాయకులపై తీవ్రంగా స్పందించారు.
Also Read: Kidney Racket: కిడ్నీ రాకెట్ నిందుతుల కోసం పోలీసుల గాలింపు.. నలుగురు అరెస్ట్
రౌడీ మూకలను వేసుకొని పార్టీ కార్యాలయాలపై దాడి చేసే దరిద్రపు సంస్కృతి కాదు మాది. మాటలతో, విజ్ఞతతో, నిబద్ధతతో ప్రజల కోసం పోరాటం చేసే సంస్కృతి మాదని కవిత తెలిపారు. మూసి నది ప్రక్షాళన విషయంలో కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మూసి నదిని ప్రక్షాళించడానికి కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే ఎస్టీపీలను ఏర్పాటు చేయడమే కాకుండా గోదావరి నదితో అనుసంధానం చేయాలని ఆయన అనుకున్నారు. 31 ఎస్టీపీలను కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కవిత చెప్పారు. మూసిని కాంగ్రెస్ నాయకులు ఏటీఎంగా తయారు చేసుకోవాలని చూస్తున్నారని ఆవిడ ఆరోపించారు. అలాగే, ‘కాంట్రాక్టర్ల కోసమే ప్రాజెక్టు చేపడుతున్నారని కూడా విమర్శించారు. ఆ తరువాత, కవిత కేవలం ప్రాజెక్టులే కాకుండా, యాదాద్రిలో కేసీఆర్ మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని ఆవిడ అన్నారు. ఈ విషయంపై ‘ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా కవిత డిమాండ్ చేశారు.
Also Read: Addanki Dayakar: రాహుల్ గాంధీకి దేశ ప్రజల మద్దతు ఉంది: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి
మూసి ప్రక్షాళన పేరిట పేద ప్రజల ఇళ్లను కూల్చివేత కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని, పేద ప్రజల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు అయ్యే వ్యయం 50 వేల కోట్లు అని ఒకసారి, లక్ష కోట్లు అని మరొకసారి, లక్షన్నర కోట్లు అని ఇంకోసారి సీఎం చెబుతున్నారని తెలిపింది. మూసిని ఏటీఎంగా మార్చుకొని.. వచ్చే డబ్బును ఢిల్లీకి పంపించే ప్రణాళిక సీఎం వేశారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి కేసిఆర్ ఎంతగానో కృషి చేశారని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్నిపారదోలడానికి కేసీఆర్ సంకల్పించారని ఈ సందర్బంగా ఆవిడ తెలిపారు. అందులో భాగంగానే మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు సరఫరా చేశారని, ఫ్లోరైడ్ ని నిర్మూలించిన ఘనత కేసిఆర్ దని, అనేక సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఒక వాటర్ ప్లాంట్ పెట్టిన పాపాన పోలేదని వ్యాఖ్యానించారు.