Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly: అసెంబ్లీ ప్రాంగణంలో వరుసగా చోటుచేసుకున్న ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో శాసనసభలో తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. సభా హుందాతనాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ సభ ముగిసే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాధవరం, మాణిక్‌రావు, చింత, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సంజయ్, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి, అనిల్‌యాదవ్, గంగుల కమలాకర్‌తో సహా బీఆర్ఎస్ సభ్యులందరినీ ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సస్పెన్షన్ నిర్ణయం వెలువడిన సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ బయట ఉన్నారు. ఆ సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన అసెంబ్లీ లోపలికి చేరుకున్నారు. అనంతరం సస్పెన్షన్‌కు గురైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ తమ నిరసనను వ్యక్తం చేసేందుకు, పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు స్పీకర్‌ను కలవడానికి బయలుదేరారు. అయితే, స్పీకర్ ఛాంబర్ వైపు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ దారిలోనే అడ్డుకున్నారు. స్పీకర్ ఛాంబర్ ముందు మార్షల్స్ వారిని నిలిపివేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్షల్స్ చర్యను నిరసిస్తూ ఎమ్మెల్యేలు అక్కడే తమ ఆందోళనను వ్యక్తం చేయడంతో అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
Also Read
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
- Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
తాజావార్తలు
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
-
WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
ట్రెండింగ్
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్‌తో మరింత ఆదా.!