మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.. అధికారులపై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత…