Harish Rao: ఇకనైనా మొద్దు నిద్ర వీడండి..
- సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.
- ఇకనైనా మొద్దు నిద్ర వీడండి అంటూ వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: నాగార్జునసాగర్ నీటి విషయంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై విరుచుకపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ నుండి గత మూడు నెలలుగా ఆంధ్రప్రదేశ్‌కు కుడి కాలువ ద్వారా 10,000 క్యూసెక్కుల నీరు తరలించబడుతోంది. రోజూ సుమారు రెండు టీఎంసీల నీరు ఏపీకి చేరుతోంది. ఈ తరలింపును ఆపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సాగర్ నీటిని ఏపీ తరలించడంపై అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టమైన విజ్ఞప్తి చేసేందుకు వెనుకడుగేస్తోందని విమర్శలు వస్తున్నాయి.
Read Also: Bhupalpally: లింగమూర్తి హత్యపై ప్రభుత్వం సీరియస్.. అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
అసెంబ్లీలో నాగార్జున సాగర్ వద్ద మోహరించిన CRPF బలగాలను వెనక్కి తీసుకోవాలని తీర్మానం చేసినప్పటికీ, వాటిని రద్దు చేయాలని కేంద్రాన్ని కోరే ధైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదని ఆరోపించారు. అంతేకాకుండా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ఈ అంశంపై మాట్లాడే ధైర్యం లేదని అన్నారు. మా మీద ఎగరాలంటే జానెడు జానెడు ముఖ్యమంత్రి ఎగురుతారని ఎద్దేవా చేసారు. ఇకనైనా మొద్దు నిద్ర వీడి రాష్ట్రములోని లక్షల ఎకరాల్లో ఉన్న భూములకు నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు.
ఏపీ నీటిని తరలించుకుపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం అన్యాయమని, శిష్యుడు రేవంత్ సీఎంగా ఉన్నందునే చంద్రబాబు ఈజీగా నీటిని తరలించుకుపోతున్నారని హరీష్ అన్నారు. ఏపీ నీటి తరలింపుకు రేవంత్ రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నాడని, చంద్రబాబు కేంద్రంలో తన పలుబడిని ఉపయోగిస్తున్నారని.. తెలంగాణకు నీళ్ళు తెస్తారా? చంద్రబాబు ఒత్తడికి తలొగ్గుతారా? అని ప్రశ్నించారు.
ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆలోచించాలని, రాష్ట్రం కోసం పనికి రాని కేంద్రమంత్రలు ఎందుకని అంటూనే.. ఏపీ జల దోపిడి కిషన్ రెడ్డికి కన్పించటం లేదా అంటు ప్రశ్నించారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు లేకపోవడంతో తెలంగాణ కోసం కొట్లాడేవారే లేరని, వెంటనే సాగర్ కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని కోరారు. ప్రభుత్వ మొద్దు నిద్ర వలన నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ కు తాగునీరు కూడా ఉండదని గుర్తు చేసారు. ఏపీ నీటిని తరలించుకుపోతుంటే.. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం మాట్లాడటం లేదని, సీఎం రేవంత్ వెంటనే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకవెళ్లి.. సాగర్ ను CRPF కంట్రోల్ నుంచి తొలగించేందుకు కిషన్ రెడ్డి చొరవతీసుకోవాలని మాట్లాడారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!