Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Brs Mla Harish Rao Comments Telangana Budget 2024

Harish Rao: కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదు..

Published Date :February 10, 2024 , 4:54 pm
By Mahesh Jakki
Harish Rao: కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Harish Rao: బడ్జెట్ అన్ని వర్గాల వారిని నిరాశ పరిచిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. వాగ్దాన భంగంకు బడ్జెట్ అద్దం పడుతుందన్నారు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా బడ్జెట్ ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్‌లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై హరీశ్‌రావు మాట్లాడారు. అన్నదాతలను ఆగం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. రైతు భరోసా, బీమాలకు నిధులు ఇవ్వలేదన్నారు. రైతుల విషయంలో హస్తం మొండి చేయి అయిందని.. ఈ బడ్జెట్‌లో రుణమాఫీ కోసం నిధుల కేటాయింపులు లేవన్నారు. రైతుల బోనస్‌కు బోగస్ చేసింది ఈ ప్రభుత్వం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతుల ఆగ్రహానికి గురి కాక తప్పదన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్ధాలు చెప్పారు, అసెంబ్లీలో అబద్ధాలు చెప్తున్నారని హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఎక్కడా 24 గంటలు కరెంట్ రావట్లేదని.. సబ్ స్టేషన్‌లకు వెళ్లి లాగ్ బుక్‌లు చూద్దాం రండి అంటూ కాంగ్రెస్ నేతలకు సవాల్‌ విసిరారు.

Read Also: CM Revanth: సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు గుడ్ న్యూస్..

బడ్జెట్‌లో 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలో 13 హామీలు ఉన్నాయని.. వీటిలో రెండు హామీలు మాత్రమే అమలు అయ్యాయని.. మిగతా 11 హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. వీటిలో ఏది కూడా అమలు చేయట్లేదన్నారు. జనవరి నెల పెన్షన్‌లను ఇవ్వకుండా ఎగ్గొట్టారని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని.. లేకుంటే నిరుద్యోగుల నుంచి నిరసనలు తప్పవన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలి.. దానికి కేటాయింపులు లేవన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. గృహ జ్యోతి ద్వారా ఉచిత కరెంట్ కావాలంటే 8 వేల కోట్లు కావాలి , కానీ రెండు వేల కోట్లు మాత్రమే పెట్టారన్నారు. ఆటో కార్మికులకు బడ్జెట్‌లో ఎలాంటి కేటాయింపులు లేవన్నారు. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా…ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్‌ రావు తీవ్రంగా వ్యాఖ్యానించారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • BRS MLA Harish Rao
  • BRS Party
  • congress
  • harish rao
  • telangana

తాజావార్తలు

  • Adivi Sesh: ‘డెకాయిట్’ నా కల.. రెండేళ్ల కష్టానికి ప్రతిరూపం: అడివి శేష్

  • Venkatesh: సుప్రియ కోసం కాదు.. ఆయన కోసమే ఈవెంట్‌కు వచ్చా.. విక్టరీ వెంకటేష్

  • Dacoit Movie: ఇక నా వల్ల కాదు, తెలుగు సినిమా చేయను.. డైరెక్టర్‌కు మృణాల్ ఠాకూర్ ఫోన్!

  • OTR: రామచంద్రపురంలో షాడో ఎమ్మెల్యేలా మంత్రి తండ్రి.?

  • Story Board : Iran షరతులకి America తలొగ్గుతుందా..? పశ్చిమాసియాలో శాంతి సాధ్యమేనా..?

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions