RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు… వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు తీయాలన్నారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ చుట్టు ప్రక్కల ఫోన్ కాల్స్ డీటైల్స్ బయటకు తీయాలని.. మేడిగడ్డలో పిల్లర్ కుంగటంపై సిట్ విచారణ జరపాలని చెప్పింది. అక్టోబర్ 21, 2023న రవికాంత్ అనే ఇంజినీర్ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ ఎందుకు జరపడం లేదు? అని ప్రశ్నించారు. మేడిగడ్డ పిల్లర్ కు క్రాక్ ఎందుకు వచ్చిందో కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎందుకు చెప్పలేదు? అని నిలదీశారు. అటెన్షన్ డైవర్షన్ కోసమే ప్రభుత్వం పీసీ ఘోష్ కమిషన్ వేసిందన్నారు. కిషన్ రెడ్డి ఆదేశాలతోనే ఒక్క రోజులోనే NDSA మేడిగడ్డకు వచ్చిందని తెలిపారు.
READ MORE: Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
కేసీఆర్‌ను బద్నాం చేయటానికి స్క్రిప్ట్ ప్రకారం కూల్చివేశారని.. మేడిగడ్డలో కుంగిన పిల్లర్ కు కావాలనే మరమ్మత్తులు చేయటం లేదని ఆర్‌ఎస్ ప్రవీణ్ ఆరోపించారు. “ఆంధ్ర పెట్టుబడిదారుల ప్రతినిధిగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. సీఎం రమేష్ కు వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర జరిగిన పేల్లుళ్ళు వెనుకున్న అసాంఘీక శక్తులు కాంగ్రెస్, బీజేపీలే. బీఆర్ఎస్ హాయాంలో అప్పులపై ముఖ్యమంత్రి రేవంత్ అవాస్తవాలు చెప్పారని పార్లమెంట్ సాక్షిగా తేలింది. ప్రజాభవన్ లో బంగారు బాత్రూమ్ లు ఉన్నాయన్న భట్టి.. అదే భవన్ లో ఎలా ఉంటున్నారు.” అని ఆర్ఎస్ ప్రవీణ్ వ్యాఖ్యానించారు.