జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌పై విచారణ జరిగింది. సీఎం రమేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కేసులో ఆయన శనివారం విచారణకు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో మరో రాజకీయ కలకలం రేగింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
RS Praveen: కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కుట్ర ప్రకారం కూల్చివేశాయని బీఆర్ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పేలుళ్ళు వెనుక రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారన్న అనుమానం ఉందన్నారు. మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుకు కారణం బీజేపీ, కాంగ్రెస్ లే కారణమని ఆరోపించారు. రేవంత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు... వారి అనుచరుల ఫోన్ కాల్స్ టేడాను బయటకు…
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా... తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు... జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది?
Koppula Eshwar Said BRS not merging BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుంది అంటూ ఎంపీ సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ‘ఇయర్ ఆఫ్ ది జోక్’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎన్నటికీ బీజేపీలోనే కాదు.. ఏ పార్టీలో విలీనం కాదన్నారు. సీఎం రమేష్ ఎప్పుడు బీజేపీలో చేరారు అని, బీజేపీలో ఆయనకు ఉన్న పరపతి ఎంత అని ప్రశ్నించారు. కంచెగచ్చిబౌలి భూముల విషయంలో సీఎం రమేష్ మధ్యవర్తిగా…
MP CM Ramesh : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత అరెస్టు సమయంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. సీఎం రమేష్ మాట్లాడుతూ, “కవిత అరెస్ట్ తర్వాత నువ్వే నా ఇంటికి వచ్చావు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానని అప్పుడే చెప్పావు. కవితను విడుదల చేస్తే బీఆర్‌ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తానని నువ్వు చెప్పిన విషయం మరిచిపోయావా?” అని ప్రశ్నించారు. JD…
ఎంపీ సీఎం రమేష్ నాయుడు, ఆయన సోదరుడు సీఎం సురేష్ నాయుడుపై పొట్లదుర్తి గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువురిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సొంత గ్రామం కోసం సీఎం రమేష్ ఎంపీగా ఒక్క మంచి పని అయినా చేశారా? అని ప్రశ్నించారు. ఎంపీగా సొంత గ్రామంలో ఒక్క అభివృద్ధి పని చేశావా? అంటూ నిలదీశారు.. సొంత సామాజిక వర్గానికి కూడా న్యాయం చేయలేదన్నారు. కాంట్రాక్టు పేరుతో పనులు చేస్తామని చెప్పి బిల్లులు మంజూరు చేయించుకుంటున్నారన్నారు.
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చెన్నమనేని రమేష్ పిటిషన్ డిస్మిస్ చేసింది. పదిన్నర సంవత్సరాల పాటు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణ సందర్భంగా కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి, ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లు కోర్టు తెలిపింది. రూ.30 లక్షల జరిమానా విధించింది. ఆది శ్రీనివాస్ కు రూ. 25 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. మరో 5 లక్షలు హైకోర్టు లీగల్…
రుషికొండ విషయంలో కోర్టులకు తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకెళ్తనన్నారు. ముఖ్యమంత్రితో చర్చించి బాధ్యులపై చర్యలు ఖచ్చితంగా ఉంటాయని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. బయట నుంచి వచ్చిన రెడ్లు ఉత్తరాంధ్రలో దందాలు చేశారని భారీగా భూ దోపిడీ జరిగిందన్నారు. దోపిడీకి గురైన భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో జరిగిన భూ దోపిడీకి…
ఏపీ ప్రజలకు మంచి చేయాలన్నదే తమ లక్ష్యం అని అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విధ్వాంసానికి గురైన ఏపీని ఎలా బాగు చేయాలన్నదే తమ ఆలోచన అని తెలిపారు. అప్పుడే కొందరు పారిపోవాలని చూస్తున్నారని, వారికి లుక్ ఔట్ నోటీసులు ఇవ్వాలన్నారు. గెలిచిన వారి నుంచి ఫోన్లు వస్తున్నాయని, వారిని రానిచ్చే పరిస్ధితి లేదని సీఎం రమేష్ పేర్కొన్నారు. అనకాపల్లి లోక్‌సభ నుంచి సీఎం రమేష్ గెలుపు దాదాపుగా ఖాయం అయింది. సీఎం రమేష్…