Crime News: ప్రకాశంలో దారుణం.. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లెలిని చంపిన అన్న!
- ప్రకాశంలో దారుణం
- సొంత చెల్లెలిని చంపిన అన్న
- స్థానిక పోలీసు అధికారికి అనుమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు.. మనిషిలోని మానవత్వాన్ని కూడా చంపేస్తోంది. పైసల కోసం సొంత వ్యక్తులను కూడా కడతేర్చుతున్నారు. గతంలో రైతుబీమా డబ్బు కోసం కన్న తల్లిని కొడుకు కడతేర్చిన ఘటన తెలంగాణలోని మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఓ అన్న ఇన్సూరెన్స్ డబ్బు కోసం సొంత చెల్లినే చంపేశాడు. యాక్సిడెంట్ అని నమ్మించే ప్రయత్నం చేసి.. పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ ఘటన గతేడాది ఫిబ్రవరిలో జరగ్గా.. చాలా ఆలస్యంగా పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే… కాటూరివారిపాలెంకు చెందిన అశోక్ రెడ్డి, సంధ్యలు అన్నా చెల్లెళ్లు. అశోక్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి.. అప్పుల పాలయ్యాడు. సంధ్యకు పెళ్లయినప్పటికీ.. అనారోగ్య కారణాలతో భర్త నుంచి విడాకులు తీసుకుని అన్న అశోక్ రెడ్డి ఇంట్లోనే ఉంటోంది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అశోక్ రెడ్డి.. పక్కా ప్లాన్‌తో చెల్లెలి పేరిట ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. చెల్లెలు ప్రమాదంలో చనిపోతే.. ఆ డబ్బంతా తనకు వస్తుందని పథకం రచించాడు. ఈ క్రమంలో ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లిస్తూ వచ్చాడు.
Also Read
- Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్‌రేట్ ప్లస్.. కానీ ఆసీస్‌తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్‌కు ఉన్న అవకాశాలివే..
పక్కా ప్లాన్ ప్రకారం.. గతేడాది ఫిబ్రవరి 2న చెల్లెలు సంధ్యను అశోక్ రెడ్డి హత్య చేశాడు. అనంతరం యాక్సిడెంట్‌లో చనిపోయిందని చెప్పాడు. చెల్లెలిని ఇంటికే తీసుకువస్తుండగా కారు చెట్టుకు ఢీకొట్టిందని, ప్రమాదంలో ఆమె చనిపోయిందని అందరికీ చెప్పాడు. పలు కేసులను రీఓపెన్ చేసే సమయంలో స్థానిక పోలీసు అధికారికి ఈ కేసులో అనుమానం కలిగింది. మరలా దర్యాప్తు చేయగా అశోక్ రెడ్డి పన్నాగం బయటపడింది. ప్రకాశం జిల్లా పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!