Pawan Kalyan and Sai Dharam Tej Movie Censor Certificate, RunTime: ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా ‘బ్రో’. బ్రో సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్స్‌గా నటించారు. తమిళ సినిమా ‘వినోదయ సీతం’ సినిమాకు ఇది రీమేక్. ఒరిజినల్లో ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్రఖనినే.. బ్రో సినిమాను తెరకెక్కించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ సినిమాను నిర్మించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒరిజినల్ స్టోరీలో మార్పులు చేసి తెలుగు నెటివిటీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే, మాటలు అందించారు.
కంప్లీట్ ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్‌తో కూడిన ‘బ్రో’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జులై 28న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా రిలీజ్‌కు సమయం దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబందించిన సెన్సార్ సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రో సినిమాకు సెన్సార్ బోర్డు ‘యూ’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంట 14 నిమిషాలు (134.30 నిమిషాలు)గా ఉంది.
సమయం లేదంటూ నిత్యం ఉరుకులు, పరుగులు పెట్టే ఓ వ్యక్తి యాక్సిడెంట్ అయి చనిపోతాడు. ఆ చనిపోయిన వ్యక్తికి మరిన్ని రోజులు బతికేందుకు సమయం ఇస్తే.. ఏం చేశాడన్నదే బ్రో సినిమా కథ. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ గాడ్‌గా కనిపించనుండగా.. కామన్ మ్యాన్ పాత్రలో సాయి ధరమ్ తేజ్ నటించారు. పవన్, సాయి తేజ్ కలసి నటించిన ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
బ్రో సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, పోస్టర్ భారీ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. గత శనివారం రిలీజైన బ్రో ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. కేవలం 45 నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందాన్ని కమెడియన్ పాత్రలో చూడబోతున్నాము.
Also Read: Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!