West Indies Announce ODI Squad against India 2023: స్వదేశంలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. మంగళవారం ఉదయం 15 మంది సభ్యులతో కూడిన జట్టును విండీస్ బోర్డు చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ప్రకటించారు. వన్డే జట్టుకు షాయ్ హోప్ కెప్టెన్ కాగా.. రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్. వన్డే సిరీస్‌కు స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ దూరమయ్యారు. అమెరికా వేదికగా జరగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో పూరన్ ఆడుతుండంతో జాతీయ జట్టుకు అందుబాటులో లేడు. మరోవైపు హోల్డర్‌కు విండీస్ సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.
వన్డే సిరీస్‌లో విండీస్ విధ్వంసకర ప్లేయర్ షిమ్రాన్ హెట్‌మైర్ రీ ఎంట్రీ ఇచ్చాడు. విండీస్ క్రికెట్ బోర్డ్‌తో విభేదాల కారణంగా గత కొంత కాలంగా జట్టుకు హెట్‌మైర్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన హెట్‌మైర్.. రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చాడు. అతడిపై విండీస్ భారీ ఆశలు పెట్టుకుంది. ఫాస్ట్ బౌలర్ ఒషానే థామస్‌కు కూడా విండీస్ జట్టులో చోటు దక్కింది. ఈ ఇద్దరి రాక విండీస్ జట్టుకు ఉపయోగపడనుందని చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ అన్నారు.
Also Read: Lizard in Mouth: నోట్లో బల్లిపడి బాలుడు మృతి.. అసాధ్యం అంటోన్న జంతు నిపుణులు!
పేసర్ జేడెన్ సీల్స్, లెగ్ స్పిన్నర్ యాన్నిక్ కరియా మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గుడాకేష్ మోటీ గాయాల నుంచి కోలుకొని మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టులోకి తిరిగి వచ్చారు. జూలై 27న బార్బడోస్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ మొదలు కానుంది. ఇక బీసీసీఐ ఈ వన్డే సిరీస్ కోసం ఇప్పటికే జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రెండు మ్యాచుల టెస్ట్ సిరీస్‌ను భారత్ 1–0తో సొంతం చేసుకుంది.
వన్డేలకు వెస్టిండీస్ జట్టు:
షాయ్ హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథానాజ్, యానిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రాన్ హెట్మెయర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, గుడాకేష్ మోటీ, జైడెన్ సిన్సీల్స్, రొమారియోక్ల్ సీల్స్.
Also Read: IND vs WI 2nd Test: భారత్, విండీస్ రెండో టెస్టు డ్రా.. సిరీస్ 1-0తో రోహిత్ సేన సొంతం!
West Indies name squad for CG United ODI Series powered by YES BANK
Full details here⬇️https://t.co/dlls8r9uZl pic.twitter.com/zGoHmgKACy
— Windies Cricket (@windiescricket) July 24, 2023