పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న సినిమా ‘బ్రో ది అవతార్ ‘.జూలై 28న గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో బ్రో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా పూర్తి అవుతున్నాయి.. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది..ఈ సినిమాకు 2 గంటల 15 నిమిషాల రన్ టైమ్ ను మేకర్స్ ను ఫిక్స్ చేసారు..ఈ సినిమాను పి. సముద్రఖని తెరకెక్కించారు.ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది.. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా పాటలు కూడా బాగానే ఆకట్టుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించి ఒక తాజా అప్డేట్ ను విడుదల చేసారు మేకర్స్.పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది. జూలై 21న ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయబోతున్నట్లు నిర్మాత వివేక్ కూచిబొట్ల తాజాగా ఓ ప్రెస్ మీట్ లో వెల్లడించారు.. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకపై మేకర్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 24న అనుకున్నా.. పవన్ వారాహితో బిజీగా ఉండటంతోఅదే తేదీనీ ఫిక్స్ చేయలేకపోతున్నారు మేకర్స్.. దీనిపై మరో రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.ఈ సినిమా ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కింది.ఈ సినిమా కు త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లు పలు మార్పులు చేర్పులు చేశాడనీ సమాచారం..ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే..ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్ పై వివేక్ కూచిబొట్ల ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.. మరీ విడుదల అయిన తరువాత ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.