Nurse: ఏడుగురు నవజాత శిశువులను చంపిన నర్సు.. గుర్తించిన భారత సంతతి వైద్యుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన పైశాచికం వల్ల అప్పుడే పుట్టిన ఏడుగురు నవజాత శిశువుల ప్రాణాలను తీసింది ఓ నర్సు. తన వృత్తికే కాదు.. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చింది. ఈ హృదయ విదారక ఘటన ఇంగ్లాండ్ లో జరిగింది. యునైటెడ్ కింగ్డమ్లోని చెస్టర్ హాస్పిటల్లో పనిచేస్తున్న లూసీ లెట్బీ అనే నర్సు.. ఏడుగురు నవజాత శిశువులను హత్య చేయగా.. మరో ఆరుగురు చిన్నారులను హత్యాయత్నానికి పాల్పడినట్లు మాంచెస్టర్ క్రౌన్ కోర్టు నిర్ధారించింది. పిల్లలను చంపేందుకు ఇన్సులిన్ ఇంజెక్ట్ చేయడం, నరాల్లోకి గాలి నింపడం, అధిక మోతాదులో పాలు ఇవ్వడం వంటి పద్ధతులను ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు.
Jagga Reddy: పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన జగ్గారెడ్డి.. ఇది ఫైనల్..!
Also Read
ఈ మారణ దుశ్చర్యకు పాల్పడుతున్న విషయాన్ని భారత సంతతి వైద్యుడు రవి జయరాం గుర్తించాడు. దీంతో ఈ విషయం బయటపడింది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. మరోవైపు చిన్నారుల హత్య ఘటనపై భారత సంతతి వైద్యుడు రవి జయరాం కీలక విషయాలను తెలిపారు. తాను ఆ నర్సు గురించి ముందే హెచ్చరించానని, అప్పుడే గుర్తించి ఉంటే.. ఆ పసికందుల ప్రాణాలు మిగిలిఉండేవని విచారం వ్యక్తం చేశారు. 2015-16 నుంచే ఈ దారుణాలకు పాల్పడుతుందని డాక్టర్ తెలిపారు. మరోవైపు లూసీ లెట్బీ (33)ని కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ నర్సును పట్టించడంలో ముఖ్యపాత్ర పోషించిన డాక్టర్ జైరామ్ సహా ఇతర వైద్యులు చేసిన ఫిర్యాదుతో ఈ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇదే ఆసుపత్రిలో జయరాం పిల్లల డాక్టర్ గా పనిచేస్తున్నారు.
Gold Seized: లుంగీలో బంగారం.. కేటుగాడి గుట్టురట్టు చేసిన కస్టమ్స్ అధికారులు
తీర్పు అనంతరం రవి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. హత్యకు గురైన పిల్లలు బతికి ఉంటే…ఈరోజు ఆ పిల్లలు పాఠశాలకు వెళ్తుండే వారన్నారు. 2015 జూన్లో ముగ్గురు నవజాత శిశువులు మరణించినప్పుడు.. తాను ఆందోళన వ్యక్తం చేశానని ఆయన చెప్పారు. ఎక్కువ మంది పిల్లలు చనిపోతే.. నా తోటి సీనియర్ వైద్యులు కూడా సమావేశాలు నిర్వహించి ఆసుపత్రి పాలకవర్గ అధికారులతో ఆందోళన వ్యక్తం చేశామని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులను కలిసేందుకు 2017 ఏప్రిల్లో నేషనల్ హెల్త్ సర్వీస్ ట్రస్ట్ అనుమతించిందని డాక్టర్ జైరాం తెలిపారు. చిన్నారుల అనుమానాస్పద మరణాల గురించి తాము పోలీసులకు చెప్పడంతో.. పోలీసులు దానిపై దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో నర్స్ లూసీపై తొలిసారి అనుమానం వచ్చింది. విచారణ, వివరణాత్మక విచారణ తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!