Gurugram: ఆస్పత్రిలో దారుణం.. విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
- గురుగ్రామ్ ఆస్పత్రిలో దారుణం
- విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైద్యం కోసం కజకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళా రోగిపై ఆస్పత్రిలోనే అత్యంత దారుణానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. చికిత్స తర్వాత బెడ్‌పై కోలుకుంటుండగా.. మత్తు మందు ఇచ్చి అటెండర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. గుర్తించిన బాధితురాలి కుమార్తె.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. ఈ దారుణం గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Chandipura Virus: చండీపురా వైరస్‌తో మరో ఇద్దరు చిన్నారులు మృతి.. 8కి చేరిన మృతుల సంఖ్య
Also Read
- TMC Rebel MPs: 20 మంది TMC రెబల్ ఎంపీలకు షాక్.. అనర్హత పిటిషన్‌పై స్పీకర్ కీలక చర్య
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
ఆర్థ్రోస్కోపీ చికిత్స కోసం కజకిస్థాన్‌కు చెందిన 51 ఏళ్ల మహిళ ఆర్టెమిస్ హాస్పిటల్‌లో జూలై 9న ఆస్పత్రిలో చేరింది. టెస్టుల తర్వాత వైద్యులు ఆమెకు శనివారం శస్త్ర చికిత్స చేశారు. అనంతరం నార్మల్ వార్డుకు తరలించారు. సహాయంగా ఆమె కుమార్తె ఉంది. ఆదివారం అటెండర్.. ఠాకూర్ సింగ్ (24).. మహిళకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తుండగా.. ఆమె కుమార్తె గుర్తించి పెద్ద పెద్దగా కేకలు వేసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ఇక సోమవారం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (2) (e) (రేప్) కింద సింగ్‌పై FIR నమోదు చేశారు. సోమవారం సిటీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం అధికారులతో సహకరిస్తామని ఆర్టెమిస్ హాస్పిటల్ ప్రతినిధి వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Aman Preet: డ్రగ్స్ కేసులో ఏ6గా రకుల్ ప్రీత్ సోదరుడు
తాజావార్తలు
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
King 100 Glimpse: నాగార్జున 100వ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు డేట్ ఫిక్స్.. ఆ రోజు అసలు సర్ప్రైజ్
-
Nepal Floods: నేపాల్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు.. 1,000 మందికి పైగా గల్లంతు!
-
Pavan Sadineni Arrest: టాలీవుడ్ డైరెక్టర్ పవన్ సాదినేని అరెస్ట్.. లైంగికంగా వాడుకున్నాడని ఫిర్యాదు!
-
Fanta: ఒకే బ్రాండ్.. రెండు దేశాలు.. కానీ చక్కెరలో భారీ తేడా!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!