Trivikram: భీమ్లా నాయక్ కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్ ను తెలుగు పరిశ్రమకు పరిచయం చేశాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. సాధారణంగా త్రివిక్రమ్ రిస్క్ లు తీసుకోడు.. ఒక కాంబో హిట్ టాక్ వచ్చింది అంటే.. దాన్నేరిపీట్ చేస్తూ ఉంటాడు. హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఎవరైనా త్రివిక్రమ్ తో హిట్ వచ్చాకా.. వారు కూడా త్రివిక్రమ్ తో చేయడానికే ఇష్టపడతారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు.. పూజా హెగ్డే, శ్రీయ.. ఇక ఇప్పుడు వీరి లిస్ట్ లోకి చేరిపోయింది సంయుక్తా మీనన్. భీమ్లా నాయక్ తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది. వరుస అవకాశాలు.. వరుస హిట్లు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన ఈ ముద్దుగుమ్మే ఫస్ట్ ఛాయిస్. ఇక ఇదే విషయం తెలుసుకున్న త్రివిక్రమ్.. అమ్మడికి మరో అవకాశం ఇచ్చాడని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబు తో SSMB26 సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. దీని తరువాత త్రివిక్రమ్- అల్లు అర్జున్ కాంబోలో ఒక సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఈ చిత్రంలో బన్నీ సరసన హీరోయిన్ గా సంయుక్తాను ఫైనల్ చేసినట్లు టాక్ నడుస్తోంది.
Krithi Shetty: నాగ చైతన్య నాకేం సక్సెస్ ఇవ్వలేదు.. బేబమ్మ ఇచ్చి పడేసిందంతే
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి హ్యాట్రిక్ హిట్ అందుకున్న కాంబో కావడంతో సినిమాపై మంచి హైప్ ఉంది. అది ఒక్కటేనా.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు బన్నీ.. పుష్ప 2 రిలీజ్ అయితే ఆ రేంజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆ సినిమా తరువాత వస్తున్న సినిమా అంటే.. అభిమానూలు ఏ రేంజ్ లో ఉహించుకుంటారో అందరికి తెల్సిందే. అందుకే.. త్రివిక్రమ్ సైతం.. ఆ సినిమా కోసం మంచి స్టార్ క్యాస్టింగ్ ను వెతికే పనిలో పడ్డాడట. ఇప్పటికే అమ్మడు అడుగుపెట్టిన నాలుగు సినిమాలు హిట్.. ఇక ఇదే కంటిన్యూ అయితే.. ఈ సినిమా కూడా హిట్టే అని చెప్పొచ్చు.. ఏదిఏమైనా త్రివిక్రమ్.. ఈసారి కూడా గట్టిగానే ప్లాన్ చేశాడు అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.