Brazil Plane Crash : బ్రెజిల్ లో కుప్పకూలిన విమానం..62మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Brazil Plane Crash : బ్రెజిల్‌లోని విన్‌హెడో నుంచి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇక్కడ 62 మందితో ప్రయాణిస్తున్న విమానం కూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. బ్రెజిల్‌లోని విన్‌హెడోలో 62 మందితో ప్రయాణిస్తున్న ప్రయాణీకుల విమానం కూలిపోయిందని స్థానిక మీడియా సంస్థలు శుక్రవారం నివేదించాయి. బ్రెజిల్ ప్రాంతీయ విమానయాన సంస్థ VOEPASS 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో కాస్కావెల్ నుండి గ్వారుల్హోస్ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సావో పాలో రాష్ట్రంలోని విన్హెడావో ప్రాంతంలో ఫ్లైట్ 2283-PS-VPB ప్రమాదానికి గురైనట్లు ధృవీకరించింది.
మెట్రోపాలిటన్ సావో పాలోకు వాయువ్యంగా 80 కిలోమీటర్లు (50 మైళ్ళు) దూరంలో ఉన్న విన్‌హెడో నగరంలో కూలిన విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే విషయాన్ని అధికారులు వివరించలేదు. అయితే స్థానికులు ఎవరూ బాధితులు కాదని ఘటనా స్థలంలో ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. విమానం ఎలా కూలిపోతుందో వీడియోలో చూడవచ్చు. ముందుగా గాలిలో తేలియాడుతున్న విమానం తెగిన గాలిపటంలా నేలపై పడింది.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
- AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
Read Also:Paris Olympics: రెజ్లింగ్‌లో తొలి పతకం తెచ్చిన అమన్.. భారత్ ఖాతాలో మరో కాంస్యం..
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024
VOEPASS ఒక ప్రకటనలో, ‘ఫ్లైట్ 2283లో ఉన్న మొత్తం 62 మంది అక్కడికక్కడే మరణించారని కంపెనీ ధృవీకరించింది. ఈ సమయంలో విమాన ప్రమాద బాధిత కుటుంబాలకు సహాయాన్ని అందజేస్తామని ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి అధికారులు విచారణ చేపట్టారు. జనవరి 2023 తర్వాత ఇదే అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం. నేపాల్‌లోని యేటి ఎయిర్‌లైన్స్ విమానం ల్యాండింగ్ సమయంలో నిలిచిపోయి కుప్పకూలిన విమానంలో 72 మంది మరణించారు. ఆ విమానం ATR 72.. తుది నివేదిక లో ఫైలట్ తప్పిదమే కారమణని తేల్చింది.
విమానం నుంచి భారీగా పొగ, మంటలు వస్తున్నాయని బ్రెజిల్ టెలివిజన్ నెట్‌వర్క్ గ్లోబ్ న్యూస్ తెలిపింది. విమానం నివాస ప్రాంతంలో పడిపోయింది. విమాన ప్రమాదం తర్వాత దక్షిణ బ్రెజిల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా సమావేశంలో హాజరైన ప్రజలను లేచి నిలబడి ఒక నిమిషం మౌనం పాటించాలని కోరారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారని అధ్యక్షుడు తతెలిపారు. అగ్నిమాపక దళం, మిలిటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారుల బృందాలు విన్‌హెడోలో ప్రమాద స్థలంలో మోహరించాయి.
Read Also:Off The Record: రూట్ మారుస్తున్నారా..? బీజేపీకి దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయిందా..?
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!