Prosthetic Foot : దేశంలో తొలిసారిగా తక్కువ ఖర్చుతో ఉన్న అధునాతన కర్బన్ ఫైబర్ కృత్రిమ కాలుపాదాన్ని భారతీయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (DRDL) మరియు ఎయిమ్స్ బీబీనగర్ సంయుక్తంగా ఈ పాదాన్ని రూపొందించారు. ఈ వినూత్న ఆవిష్కరణను మంగళవారం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా అభివృద్ధి చేసిన ఈ కృత్రిమ కాలుపాదం, దిగువస్థాయి ఆదాయ గల అమ్ప్యూటీలకు గుణాత్మక ప్రోస్తెటిక్ లభ్యతను పెంచడంతో…
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
హైదరాబాద్ లోని కేంద్ర రక్షణ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను పాకిస్తానీ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు. కంచన్‌బాగ్ డి అర్ డి ఎల్ లో తాజాగా బయటపడిన హనీ ట్రాప్ కేస్ లో కీలకాంశాలు బయటపడుతున్నాయి. డీఆర్‌డీఎల్‌లో క్వాలిటీ ఇంజనీర్ గా పనిచేస్తున్న మల్లికార్జునరెడ్డిని హనీ ట్రాప్ చేసింది నటాషా అనే అమ్మాయి. కె సీరీస్ మిస్సైల్ కు చెందిన కీలక సమాచారాన్ని నటాషాకు చేరవేశాడు మల్లికార్జునరెడ్డి. యుకే అనుసంద డిఫెన్స్ జర్నలిస్ట్ పేరుతో ట్రాప్ చేసింది నటాషా.…