జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ & సీఈవో డా, జైతీర్థ్ ఆర్. జోషి, బ్రహ్మోస్ హైదరాబాద్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, డీఆర్‌డీఎల్ డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తి, తదితరులు సీఎంతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లో బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థను విస్తరించాలని సీఎం కోరారు. హైదరాబాద్, బెంగుళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైనవని రేవంత్ వివరించారు.
భారతదేశం-రష్యాల జాయింట్ వెంచర్ అయిన బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్.. తమ కంపెనీలో కనీసం 15 శాతం టెక్నికల్ పోస్టులను అగ్నివీరుల కోసం రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. అనేక సంస్థల్లో అగ్నివీరులకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపింది. అయితే ఒక ప్రైవేట్ సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి. టెక్నికల్ పోస్టులే కాకుండా అడ్మినిస్ట్రేటివ్, సెక్యూరిటీ అవసరాలకు అనుగుణంగా అగ్నివీరులకు ప్రాధాన్యత ఇస్తామని బ్రహ్మోస్ తెలిపింది.
Brahmos Missile : పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం భారత నావికాదళం ఆరేబియాసముద్రంలో నిర్వహించిన ఈ మిసైల్ నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది.