Ravi Teja – Vashishta: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం సైన్స్ ఫిక్షన్ జాతర నడుస్తుంది. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత, టాలీవుడ్‌లో మరో క్రేజీ ప్రాజెక్ట్ తెరమీదకు వచ్చింది. మాస్ మహారాజా రవితేజ – ‘బింబిసారా’ ఫేమ్ డైరెక్టర్ వశిష్టతో కలిసి ఒక సై-ఫై చిత్రంలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవల రవితేజకు వశిష్ట స్టోరీ నెరేషన్ ఇచ్చారని, ఈ కథకు మాస్ మహారాజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతోంది.
READ ALSO: Champion: ఛాంపియన్ కోసం చిరుత
రవితేజ – వశిష్ట కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ 2026 అర్ధభాగంలో మొదలవుతుందని, ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని సమాచారం. డైరెక్టర్ వశిష్ట ట్రాక్ రికార్డ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. టాలీవుడ్‌లో బింబిసారా సినిమాతో సంచలనం సృష్టించిన యువ, ప్రతిభావంతమైన డైరెక్టర్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత ఆయన ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా సోషియో-ఫాంటసీ జానర్‌లోనే వస్తుంది. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ నుంచి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నారు.
READ ALSO: Rupee vs Dollar: డాలర్‌తో పోల్చితే రికార్డు స్థాయిలో రూపాయి పతనం.. కారణాలు ఇవే!