Funny Stunt Video : సోషల్ మీడియా ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి ఈ మధ్య ఎంతపెద్ద సాహసం చేయడానికైనా వెనుకాడడం లేదు. పాపులారిటీ కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టేవాళ్లు కొందరు. ఆలోచించకుండా సినిమాల మాదిరిగా స్టంట్స్ చేయడం మొదలు పెడుతున్నారు.. కానీ రీల్, రియల్ లైఫ్ పూర్తిగా భిన్నమైనవని నేటి యువత అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఎక్కువగా వైరల్ అవుతోంది. యువకులు తమ గర్ల్‌ఫ్రెండ్‌లను ఆకట్టుకోవడానికి లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడానికి కొన్ని పనులను చేయడం తరచుగా కనిపిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో కూడా ఓ యువకుడు తన ప్రియురాలిని ఆకట్టుకోవడానికి బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం కనిపిస్తోంది. కానీ విధి అతనితో ఆడుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంప్రెస్ అయిందో లేదో తెలియదు. కానీ ఇలాంటి విన్యాసాలు చేయడం తనకు ఫర్వాలేదు కానీ తన ప్రియురాలిని మాత్రం ఆస్పత్రి పాలయ్యేలా చేసింది.
Read Also:Chandrababu Arrested: చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదు.. డీజీ..!
వైరల్ అయిన వీడియోలో ఒక అమ్మాయి హెల్మెట్ ధరించి నిర్మానుష్య రహదారిపై నిలబడి ఉన్నట్లు చూడవచ్చు. ఇంతలో ఓ యువకుడు బైక్‌పై వచ్చి ఆమెకు ముద్దు పెట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఈ తరుణంలోనే బైక్ బ్యాలెన్స్ కోల్పోయి ఆ అమ్మాయిని గుద్దింది. దీంతో ఆ అమ్మాయి కిందపడిపోయింది. అందరి ముందు వారిద్దరూ నవ్వుల పాలయ్యారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వేల మంది వీక్షించారు. ప్రస్తుతానికి ఈ క్లిప్ ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించబడింది అనేది ధృవీకరించబడలేదు. అయితే ఈ వీడియో మాత్రం ఇంటర్నెట్‌లో మాత్రం నవ్వుల పువ్వులు పూయిస్తోంది.
Read Also:Jammu And Kashmir : జారి ట్రక్కుపై పడ్డ బండరాయి.. నలుగురు మృతి