Allu Arha: అల్లు వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ చరిష్మా.. అల్లు స్నేహారెడ్డి అందం పుణికిపుచ్చుకొని పుట్టిన కుందనపు బొమ్మ అల్లు అర్హ. ఆమె పుట్టడం నుంచే సెలబ్రిటీ హోదాను సంపాదించుకొంది. నిజం చెప్పాలంటే అర్హ కు ఉన్నంత ఫ్యాన్స్.. అర్హ అన్న అయాన్ కు లేదు అంటే అతిశయోక్తి కాదు. బన్నీతో కలిసి ముద్దు ముద్దు మాటలు చెప్తూ అల్లు అభిమానులను ఫిదా చేసింది. ఒక దోస స్టెప్ నుంచి ఈ మధ్య వచ్చిన కందిరీగల కథల వరకు అల్లు అర్హ చిట్టి చిట్టి పలుకుల వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అర్హ ఎంతో తెలివైన అమ్మాయి అని అల్లు అరవింద్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఒకసారి చూస్తే ఇట్టే నేర్చేసుకుంటుందట. అవును.. ఎంతైనా పుష్ప రాజ్ బిడ్డ కదా.. నటన అర్హ రక్తంలోనే ఉంది. అందుకే అర్హ 6 ఏళ్లకే వెండితెరపైకి వచ్చేసింది.
Mega Power Star Ram Charan: గోల్డెన్ గ్లోబ్ లో ఒక్క మగాడు
గుణశేఖర్ దర్శకత్వం వహించిన శాకుంతలం చిత్రంలో అల్లు అర్హ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. ప్రిన్స్ భరతుడిగా.. శకుంతల, దుశ్యంతుల ముద్దుల కొడుకుగా అర్హ కనిపిస్తోంది. ట్రైలర్ లో సింహం పై అల్లు అర్హ ఎంట్రీ అల్టిమేట్ అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా సమంత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పలేం కానీ.. అర్హ మాత్రం టాప్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగడం మాత్రం ఖాయమంటున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా కోసం అర్హ డబ్బింగ్ ను మొదలుపెట్టేసింది. డబ్బింగ్ కూడా ఎంతో శ్రద్దగా నేర్చుకొని.. హావభావాలు పలికిస్తూ మాట్లాడడం మేకర్స్ ను ఆశ్చర్యపరుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. దూరం దూరం అంటూ అర్హ పలికే డైలాగ్ తో వీడియో ఎండ్ అయ్యింది. ఏ మాత్రం బెరుకు లేకుండా.. డబ్బింగ్ స్టూడియోలో కూర్చోని.. సీన్ కు తగ్గట్టు అర్హ డైలాగ్ చెప్పడం చూసిన అభిమానులు ఎవరనుకుంటున్నారు.. పుష్ప రాజ్ బిడ్డ.. ఆ మాత్రం ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.