Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే చర్యలు తప్పవు.. స్పష్టం చేసిన మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Botsa Satyanarayana: స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.. మాకేం ప్రేమ్ చంద్రారెడ్డి మీద ప్రత్యేక ప్రేమ లేదన్నారు.. కానీ, అధికారులు అభ్యంతరం చెప్పాక.. ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది.. దానికి సీఎందే బాధ్యత అవుతుందన్నారు.. రిమాండ్ కొనసాగింపు సందర్భంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.. అందుకే ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలన్న ఆయన.. ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదు.. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టు చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవహరించారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదు.? మధ్యలో డిజైన్ టెక్ ఎలా వచ్చింది..? అని ప్రశ్నించారు.
Read Also: VC. Sajjanar: గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్
Also Read
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
చంద్రబాబు తెలిసే తప్పు చేశారు అని విమర్శించారు మంత్రి బొత్స.. సీమెన్స్ కంపెనీ మంచి కంపెనీనే.. కానీ, ఒప్పందం ప్రకారం జరగలేదన్నారు. సాఫ్ట్ వేర్ రూ. 2900 కోట్లా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్ వేర్.. ఎక్విప్మెంట్ రాలేదే..? అని ప్రశ్నించారు. మా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు ఎలాంటి అప్రిసియేషన్ లెటర్ ఇవ్వలేదు. అర్జా శ్రీకాంత్ గత ప్రభుత్వంలోనే స్కిల్ డెవలపెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులయ్యారని తెలిపారు. చాలా స్కిల్ సెంటర్లల్లో సరైన టూల్స్ లేవు.. చంద్రబాబు ఇంత అవినీతి చేసి.. ఎందుకు జైలుకెళ్లారని అందరూ బాధ పడుతున్నారు.. చంద్రబాబు పరిస్థితిని చూసి జాలి పడుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి బొత్స సత్యనారాయణ. మరోవైపు.. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో కామెంట్ చేసిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు బొత్స.. ఇలాంటి తప్పులు చేస్తే వదిలేయొచ్చా అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పోచారం అడగాలన్న ఆయన.. పోచారం లాంటి వ్యక్తులు రాజకీయం కోసం మాట్లాడొచ్చు.. కానీ, వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదని హితవుపలికారు బొత్స.
తాజావార్తలు
-
North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్‌లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!