Puri Musings: న్యూయర్ వేళ.. “భక్తుడు-దేవుడు” ఆసక్తికర కథ చెప్పిన పూరి జగన్నాథ్..
- డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్
- ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో కొత్త అంశాలు
- తాజాగా కథ రూపంలో భక్తుడు-దేవుడి మధ్య సంభాషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పూరీ మ్యూజింగ్స్’ పేరుతో మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త సంవత్సరం వేళ మరో సరికొత్త టాపిక్ తీసుకొచ్చాడు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ బాలరాజు అనే భక్తుడు దేవుడికి మధ్య జరిగిన సంభాషణను కథ రూపంలో వివరించాడు. ఈ కథని పూరి జగన్నాథ్ మాటల్లోనే..
READ MORE: Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
పాపం బాలరాజు కష్టాలు తట్టుకోలేక కఠోర తపస్సు చేశాడు. దేవుడు ప్రత్యక్షమై బాలరాజు వంక చిరాకుగా ‘ఏంటి’ అన్నట్లు చూశాడు.
బాలరాజు: స్వామి ఖర్చులు ఎక్కువైపోయాయి. కోట్లకు కోట్లు కావాలి. కాస్త మీ దగ్గర క్యాష్ ఏదైనా ఉంటే నా అకౌంట్‌లో డిపాజిట్ చేస్తారా
దేవుడు: ‘నా దగ్గర క్యాష్ ఉండదు నాయనా! బ్యాంకు అకౌంట్ కూడా లేదు’
బాలరాజు: పోనీ బంగారం, వజ్రాలు ఏమీ లేవా స్వామి
దేవుడు: నీకిస్తే అందరూ అడుగుతారమ్మా! అందుకే దగ్గర పెట్టుకోలేదు
బాలరాజు: సరే.. నాకు ఆనందాన్ని ప్రసాదించు
దేవుడు: సంతోషం అనేది మనసుకు సంబంధించింది. నువ్వు రోజూ లేనిదాని గురించి ఆలోచిస్తే, ఇంకా ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది.
బాలరాజు: అయితే, నా జీవితంలో కష్టాలనేవి లేకుండా తీసెయ్..
దేవుడు: అవి తీసేస్తే ఎలా? కష్టాల తర్వాతే కదా సుఖాలు వచ్చేదని రూల్స్ రాసుకున్నాం. సుఖాలు కావాలంటే కష్టాలు పడాల్సిందే
బాలరాజు: ఓహో.. ఓకే స్వామి. నాకు తాగుడు ఎక్కువైపోయింది మందు మానేసేలా చేయగలరా?
దేవుడు: అరేయ్ నాయనా.. ఆ మందు మొదలు పెట్టింది నువ్వు కదా.. నువ్వే మానేయాలి
బాలరాజు: అయితే, స్వామి ఈ మధ్య అందరి మీదా అరుస్తున్నా. కాస్త సహనం ప్రసాదించగలరా?
దేవుడు: అది నేను ఇవ్వాల్సిన పనిలేదు బాలరాజు.. కష్టాలు పడి, పడి సరదా తీరిపోతే, ఎక్కడిలేని సహనం వచ్చేస్తుంది..
బాలరాజు: అలాగైతే నాకు జ్ఞానోదయం ప్రసాదించి బుద్ధుడిలా మార్చు స్వామి
దేవుడు: బుద్ధుడికి కూడా నేను ఇవ్వలేదు బాబూ.. ధ్యానం చేస్తే, జ్ఞానోదయం కలిగింది. నువ్వు కూడా ప్రయత్నించు పెద్ద పని కాదు..
బాలరాజు: వద్దులే స్వామి.. అంత ఓపిక లేదు. పోనీ ఈ కొత్త సంవత్సరం అయినా నా జీవితం మారుతుందా?
దేవుడు: రేయ్.. రోజూ సెలబ్రేట్ చేసుకోమని, నీకు ఇంత పొడుగు జీవితం ఇస్తే, నువ్వు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని, జీవితం మారుతుందా? అని నన్ను అడిగితే ఎలా?
బాలరాజు: మరి ఎవరిని అడగాలి.. పైగా తిక్క తిక్క సమాధానాలు చెబుతున్నావు. అసలు నిన్నెందుకు మొక్కాలి
దేవుడు: ఎవడు మొక్కమన్నాడు రా..! (దేవుడు అలా అనేసరికి బాలరాజు కంగారు పడ్డాడు. దేవుడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఇలా చెప్పాడు.)
నాకోసం ఇంత పెద్ద తపస్సు చేశావు. ఆ తపస్సు నీకోసం చేసుకోవచ్చు కదా!. అన్నీ నేనే ఇస్తే, నువ్వెందుకు? చేతకాకపోతే ప్యాకప్ చెప్పి, పైకి వచ్చెయ్..
బాలరాజు: ఆ మాట విని బాలరాజు కంగుతిన్నాడు..
దేవుడు: మళ్లీ చెబుతున్నా బంగారం.. నీకు అన్నీ ఇచ్చాను. ఇప్పుడు ఇంకో కొత్త సంవత్సరం ఇస్తున్నా. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో.. తాగుతావో తందనాలు ఆడతావో నీ ఇష్టం. ప్రతిదానికీ నన్ను పిలవకు. హ్యాపీ న్యూఇయర్’’ అని బాలరాజు డిప్పపై కొట్టి, చిటికెలో మాయం అయిపోయాడు.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!