Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయనగరంలో సీనియర్ వైఎస్సార్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వంపై విమర్శల దాడి చేశారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగాయని, దీనిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత మంత్రిని పదవి నుంచి పక్కన పెట్టాలని స్పష్టం చేశారు. యువత, నిరుద్యోగులు తమ సమస్యలపై గత డెబ్బై రోజులకు పైగా పోరాటం చేస్తున్నారని, వారు ర్యాలీలు చేయడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. వెనక్కి వెళ్తామన్నా ఒప్పుకోకుండా, కనీసం శాంతియుత ర్యాలీలకు కూడా అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకు, చేతలకు పొంతన ఉండటం లేదని విమర్శించారు. వచ్చే ఆదాయంలో సగం డబ్బులు ఉద్యోగుల జీతాలకే సరిపోతున్నాయని చెబుతున్న చంద్రబాబు, ఎన్నికల ముందు చెప్పిన సంపద సృష్టి ఏమైందో సమాధానం చెప్పాలన్నారు. ఒకవైపు సంపద సృష్టిస్తామని చెప్పి, మరోవైపు రాష్ట్రాన్ని తీవ్ర అప్పుల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు ఏ రంగంలో అభివృద్ధి సాధించారో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని సవాల్ విసిరారు.
Also Read
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, పేదలకు వరమైన ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడిచారని బొత్స ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పట్టించుకోకుండా కేవలం అమరావతి జపం మాత్రమే చేస్తున్నారన్నారు. మరోవైపు రైతులకు ఏ పంటకూ కనీస మద్దతు ధర లభించడం లేదని వాపోయారు. ఈ ప్రభుత్వం కేవలం వ్యక్తిగత స్వార్థపూరిత ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని, ఇలాంటి ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆడపిల్లలు బయటకు రావాలంటేనే తీవ్ర భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొందని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Botsa Satyanarayana: డీఎస్సీలో అవకతవకలు జరిగాయి.. సీబీఐ విచారణ జరిపించాలి: బొత్స సత్యనారాయణ
-
Cyber Fraud: తెలుగు అమ్మాయిలతో సైబర్ వల.. ఢిల్లీ ముఠా దందా బట్టబయలు
-
Kalki 2 Casting Call: డార్లింగ్ ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కావాలా? ‘కల్కి 2’ కోసం మేకర్స్ బంపర్ ఆఫర్!
-
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
-
JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!