గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాల కోసం నాకు ఎక్కడ నుంచి అధికారిక ఇన్విటేషన్ రాలేదు అని ఆమె పేర్కొన్నారు. రాజ్ భవన్ మహిళలు మాత్రం నన్ను బోనాలకు ఆహ్వానించారు.. ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం లేదు అని గవర్నర్ తెలిపారు.
తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోల్కొండలో ప్రారంభమైన బోనాలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుతున్నాయని తెలిపారు. బోనాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. రాజకీయాలకు అతీతంగా బోనాల జాతర కొనసాగుతుంది.