Bomma Blockbuster: ఎన్ని అవకాశాలొచ్చినా పిసరంత అదృష్టం కూడా కలిసి రావాలంటారు పెద్దలు. ఇది మన హీరోకి వర్తించినట్లుంది. నందూ ఇండస్త్రీకి వచ్చి చాలా కాలమే అయింది. చిన్న చిన్న సినిమాలు పెద్ద ఎత్తున చేస్తూనే వెళ్తున్నాడు. కానీ ఇంతవరకు తన ఖాతాలో పెద్ద హిట్ పడలేదు.. కెరీర్ కు సరైన బ్రేక్ దొరకలేదు. ఈ నేపథ్యంలో ఆయన విరాట్ డైరెక్షన్ లో ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అనే కొత్త సినిమా చేశాడు. యాంకర్ కమ్ యాక్టర్ రష్మి ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఈ నెల 4వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బృందం ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు. వేడుకకు నాగశౌర్య ముఖ్య అతిథిగా వచ్చాడు.
Read Also: Ayyanna Patrudu Arrest: విశాఖలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ నేతల అరెస్ట్
ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ .. ఇండస్ట్రీకి రావడం చాలా తేలికే .. కాకపోతే ఇక్కడ నిలదొక్కుకోవడమే కష్టమన్నారు. సినిమా కోసం నందూ పడిన కష్టాలు విన్నాను. అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. తాను చాలామందికి తెలియదేమోగానీ .. రష్మీ అందరికీ తెలుసు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తాను ఎంతగా కష్టపడిందనేది తాను చూశానన్నాడు. “నందూ చాలా టాలెంటెడ్ అనే విషయం చాలామందికి తెలుసు. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది” అంటూ శౌర్య అనగానే, నందూ ఒక్కసారిగా స్టేజ్ పైనే ఏడ్చేశాడు. శౌర్య అతడిని ఓదార్చుతూ .. “నా సినిమాకి చీఫ్ గెస్టుగా నిన్ను పిలిచే స్థాయికి నువ్వు ఎదుగుతావు ..” అంటూ అతడిని ఓదార్చాడు. ఈ సినిమాను తాను తప్పకుండా థియేటర్లో చూస్తాననీ .. అందరూ చూడాలని శౌర్య చెప్పాడు.