Bombay High Court: బక్రీద్ సందర్భంగా అనుమతి లేకుండా జంతువులను బలి ఇవ్వకూడదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay High Court: బక్రీద్ సందర్భంగా జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణ ముంబైలోని రెసిడెన్షియల్ కాలనీలోని ఓ సొసైటీలో జంతుబలిపై బాంబే హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బక్రీద్ పండుగ సందర్భంగా జంతువులను అక్రమంగా వధించకుండా చూడాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని కోర్టు ఆదేశించింది. ప్రత్యేక అత్యవసర విచారణలో జస్టిస్ జీఎస్ కులకర్ణి, జస్టిస్ జితేంద్ర జైన్ డివిజన్ ధర్మాసనం పౌర సంఘం లైసెన్స్ మంజూరు చేస్తేనే నథాని హైట్స్ సొసైటీలో జంతుబలిని అనుమతించవచ్చని కోర్టు పేర్కొంది.
Also Read: Adipurush: ‘ఖురాన్‌పై సినిమా తీయండి, ఏం జరుగుతుందో చూడండి’ ‘ఆదిపురుష్’ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Also Read
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
- Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
- Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
- IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
పేర్కొన్న స్థలంలో మున్సిపల్ కార్పొరేషన్ జంతు బలికి లైసెన్స్ ఇవ్వకపోతే, ప్రతిపాదిత జంతు వధను ఆపడానికి మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది సహాయంతో చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు. నథాని హైట్స్ సొసైటీ నివాసి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. జంతువుల వధను పూర్తిగా నిషేధించాలని కోరుతూ సొసైటీకి చెందిన హరేష్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారించింది. బీఎంసీ తరఫు న్యాయవాది జోయెల్ కార్లోస్ మాట్లాడుతూ, పూర్తి నిషేధం జారీ చేయబడదన్నారు.
సొసైటీ ప్రాంగణాన్ని పౌరసరఫరాల అధికారులు తనిఖీ చేస్తారని, ఉల్లంఘనలు జరిగినట్లు తేలితే తగిన చర్యలు తీసుకుంటామని కార్లోస్ తెలిపారు. ఏదైనా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్లయితే, సంబంధిత పోలీస్ స్టేషన్ మున్సిపల్ అధికారులకు తగిన పోలీసు సహాయాన్ని అందించాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
తాజావార్తలు
-
Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
-
Hydrogen Train: భారత తొలి హైడ్రోజన్ రైలుకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేకతలేంటంటే!
-
Rules Changes: సామాన్యుడికి జూలై షాక్.. 1వ తేదీ నుంచే ఈ 5 కీలక మార్పులు
-
IND Vs IRE: ఆరంభంలో తడబడినా భారీ స్కోరు చేసిన ఐర్లాండ్.. భారత్ ముందు క్రేజీ టార్గెట్..
-
Suhas: “చేతిలో కత్తి.. కళ్లలో కసి!” ‘సాట్టపులి’గా సుహాస్ ఊరమాస్ విధ్వంసం!
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!