మైనర్ బాలికను “ఐ లవ్ యు” అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పును బాంబే హై కోర్టు కొట్టేసింది. ఈ తీర్పుతో పోక్సో కేసులో దాదాపు పదేళ్లుగా శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి ఉపశమనం లభించింది. ఈ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేవలం మాటలతో ప్రేమను వ్యక్తపరచడం లైంగిక వేధింపులుగా పరిగణించబడదని పేర్కొంటూ హైకోర్టు తీర్పు వెలువరించింది.
READ MORE: Spitting Cobra : కంటెంట్ కోసం కన్ను తాకట్టు.. అందుకే కోబ్రా గేమ్స్ ఆడొద్దు..
అసలు ఏం జరిగిందంటే.. ఓ మైనర్ బాలిక తనకు “I Love You” చెప్పాడని 25 ఏళ్ల వ్యక్తిపై కేసు పెట్టింది. ఆ వ్యక్తి తనను ఆట పట్టించాడని.. ఐల వ్యూ చెప్పాడని పేర్కొంటూ.. 2015లో కోర్టును ఆశ్రయించింది. దీంతో ఆ వ్యక్తిపై పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా సెషన్స్ కోర్టు అతడిని నేరస్థుడిగా పరిగణించింది. మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైన కేసును కొట్టేయాలని అప్పీల్‌లో పేర్కొన్నారు. ఈ కేసుపై బుధవారం విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు నాగ్‌పుర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ ఊర్మిళా జోషి ఫాల్కే ఈ కేసును కొట్టేసింది. ఆ వ్యక్తిని నిర్దోశిగా ప్రకటిస్తూ తుది తీర్పు వెలువరించింది. ‘ఐ లవ్ యూ’ చెప్పడంలో లైంగిక ఉద్దేశం ఉన్నట్లు నిరూపణ కాలేదని స్పష్టం చేసింది. ఆ బాలికను ముట్టుకోవడం, అసభ్యకరమైన సైగలు చేయడం చేసి ఆమెను అవమానించట్లు నిరూపణ జరగలేదని పేర్కొంది.
READ MORE: Police High Alert: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల అరెస్ట్.. అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం..