మైనర్ బాలికను "ఐ లవ్ యు" అని ఆటపట్టించాడనే ఆరోపణలపై 2015లో దోషిగా తేలిన 25 ఏళ్ల వ్యక్తిని బాంబే హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. దిగువ కోర్టు తీర్పును కొట్టివేసింది. గతంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు.. ఆ వ్యక్తికి భారత శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 354-A (లైంగిక వేధింపులు), 354D (వెంబడించడం), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (POSCO) చట్టంలోని సెక్షన్ 8 కింద మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.