విమానాలకు బాంబు బెదిరింపుల గండం వదలడం లేదు. తాజాగా రెండు ఇండిగో ఫ్లైట్స్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడం తీవ్ర కలకలం రేపింది. జిద్దా నుంచి వస్తున్న ఇండిగో విమానం, కొచ్చి కేరళ నుంచి వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు మేలు వచ్చింది. విమానంలో ఆర్డిఎక్స్ పెట్టామని ఎప్పుడన్నా పేలి పోతుందని ఈ రెండు విమానాలకి బాంబు మెదిరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న విమానాలని ఐసోలేషన్ కి తరలించి తనిఖీలు చేపట్టారు.
Also Read:The Paradise : నాని ‘ప్యారడైజ్’ నుంచి మ్యూజికల్ ట్రీట్ అప్పుడేనా!
కోల్ కత్తా నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న ఇండిగో విమానం పైలెట్ ట్రాఫిక్ కంట్రోల్ కి కంప్లైంట్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఏడు నాటికల్ మైళ్ల దూరంలో వస్తున్న ఇండిగో విమానం మొయినాబాద్ చిలుకూరు బాలాజీ వైపు నుండి ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో ల్యాండ్ అవుతుండగా లేజర్ లైట్ వేశారని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి కంప్లైంట్ చేశాడు ఇండిగో పైలెట్. ఈ ఘటనలతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.