Abhay Verma on Transgender Role in Safed: బాలీవుడ్ యంగ్ హీరో అభయ్ వర్మ.. చిన్న చిన్న పాత్రలు, యాడ్స్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంజయ్ లీలా బన్సాలీ ‘మన్ బైరాగి’తో అభయ్ తన కెరీర్ ప్రారంభించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 అనే వెబ్ సిరీస్‌లో కూడా అభయ్ కనిపించాడు. ఇందులో తన పాత్ర కోసం కేవలం నాలుగు రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నా..అతడికి మంచి పేరు వచ్చింది. తాజాగా వచ్చిన ‘ముంజ్య’ హారర్ మూవీతో భారీ హిట్ కొట్టాడు. అయితే ‘సఫేద్’ మూవీ షూటింగ్ సమయంలో తాను తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొన్నానని అభయ్ చెప్పుకొచ్చాడు.
‘ముంజ్య’ చిత్రం కోసం అభయ్ వర్మ ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో తనకు జరిగిన ఓ షాకింగ్ సంఘటనని గురించి తెలిపాడు. ‘సఫేద్ షూటింగ్ జరుగుతుండగా ఓ రోజు రాత్రి హోటల్‌కి వెళుతున్నా. కొందరు తాగుబోతులు రోడ్డుపై ఎదురుపడ్డారు. హిజ్రా అనుకుని నన్ను అడ్డగించి.. నాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను అబ్బాయిని అని చెప్పినా వదల్లేదు. పరిస్థితి చేయి దాటిపోయేసరికి నిజం చెప్పా. సినిమా కోసమే ఈ గెటప్ వేసుకున్నానని చెప్పా. అప్పుడు వాళ్లు నన్ను వదిలేశారు’ అని అభయ్ తెలిపాడు. ట్రాన్స్ జెండర్ రోల్ చేస్తున్నప్పుడు పాత్ర ఫెర్ఫెక్షన్ కోసం ఆ గెటప్‌లోనే పలువురిని కలిసేవాడినని చెప్పుకొచ్చాడు.
Also Read: Rashmika Mandanna: మరోసారి సీమ యాస, ఆహార్యంతో సందడి చేయనున్న రష్మిక మందన్న!
‘మాది మధ్యతరగతి కుటుంబం. ఒకరోజు మా నాన్నకు కామెర్లు వచ్చి.. మంచంపై పడ్డారు. ఆ తరువాత మా అమ్మ కుటుంబ బాధ్యతను తీసుకుంది. మా నాన్న వైద్య ఖర్చులు చాలా ఎక్కువయ్యాయి. దాంతో మేం ఇంటిని అమ్మవలసి వచ్చింది. నన్ను చదివించేందుకు అమ్మ అప్పు చేసింది. ఆ తర్వాత నా సంపాదనతో ఆ అప్పును తిరిగి చెల్లించా’ అని అభయ్ వర్మ చెప్పాడు.