Rashmika Mandanna again in Rayalaseema Role: కన్నడ సోయగం ‘రష్మిక మందన్న’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో యిట్టే ఒదిగిపోతారు. ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’లో శ్రీవల్లి పాత్ర ఆమె కోసమే పుట్టుందేమో అనిపిస్తుంది. శ్రీవల్లి పాత్రలో అంతలా రష్మిక ఆకట్టుకున్నారు. సీమ యాస, ఆహార్యం ఆమెకు మరింత సహజత్వాన్ని తీసుకొచ్చాయి. పుష్ప-2లోనూ మళ్లీ ఆ పాత్రలోనే రష్మిక కనిపించనున్నారు. అయితే పుష్ప-2 తర్వాత మరోసారి సీమ యాస, ఆహార్యంతోనే నేషనల్ క్రష్ తెరపై సందడి చేయనున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా రష్మిక మందన్న దాదాపుగా ఖాయమైనట్టే. రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని అని తెలుస్తోంది. సీమ కథ, అందులోనూ పీరియాడిక్ నేపథ్యం కావడంతో… హీరోహీరోయిన్ల పాత్రలు కూడా ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయట. అంటే రష్మిక మరోసారి సీమ పాత్రలో ఒదిగిపోన్నారు.
Also Read: Bharateeyudu 2: భారతీయుడు సీక్వెల్ అవసరమా అనుకున్నా: శంకర్
ప్రస్తుతం రష్మిక మందన్న వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. యానిమల్ హిట్ కావడంతో వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ది గర్ల్‌ఫ్రెండ్, కుబేర, సికందర్ తదితర చిత్రాల్లో రష్మిక నటిస్తున్నారు. విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో ఇద్దరు నటించారు.